Share News

కృష్ణా కెనాల్‌ జంక్షన్‌లో పలురైళ్ల నిలిపివేత

ABN , Publish Date - Nov 04 , 2026 | 04:19 AM

మురసు తుఫాను ప్రభావంతో పలురైళ్లను తాడేపల్లి పరిధిలోని కృష్ణాకెనాల్‌ రైల్వేజంక్షన్‌లో ఏడు గంటలపాటు నిలిపివేశారు. ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు రైళ్లను నిలిపివేశారు.

కృష్ణా కెనాల్‌ జంక్షన్‌లో పలురైళ్ల నిలిపివేత

తాడేపల్లి టౌన్‌, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): మురసు తుఫాను ప్రభావంతో పలురైళ్లను తాడేపల్లి పరిధిలోని కృష్ణాకెనాల్‌ రైల్వేజంక్షన్‌లో ఏడు గంటలపాటు నిలిపివేశారు. ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు రైళ్లను నిలిపివేశారు. సికింద్రాబాద్‌ నుంచి గూడూరు వెళ్లే సింహపురి ఎక్స్‌ప్రెస్‌, బికనీర్‌ జంక్షన్‌ నుంచి మదురై వెళ్లాల్సిన అనువర్త్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ఇక్కడ నిలిపివేశారు. ఒంగోలు వద్ద ట్రాక్‌ కొంతమేర పాక్షికంగా దెబ్బతిందన్న సమాచారంతో రైల్వే అధికారులు ఈ రెండు రైళ్లను కృష్ణాకెనాల్‌ జంక్షన్‌లో నిలిపివేశారు. మధ్యాహ్నం రెండు గంటల తరువాత తిరిగి ఈ రైళ్లు బయలుదేరాయి. వీటితోపాటు రాత్రి ఏడు గంటల సమయంలో బికనీరు నుంచి ఎర్నాకుళం వెళ్లాల్సిన ఎక్స్‌ప్రెస్‌ను కూడా కొద్దిసేపు ఇక్కడ నిలిపివేశారు. ప్రయాణికులకు అక్షయపాత్ర నిర్వహకులు ఆహారాన్ని పంపిణీ చేశారు.

ఈ వార్తలనూ చదవండి:

కుప్పంలో టీడీపీ జైత్రయాత్ర.. 32 వార్డులూ కైవసం

కూటమికే.. పట్టణం

Updated Date - Nov 04 , 2026 | 04:22 AM