Share News

ప్రధాని మోదీకి ఎంపీ లింగమనేని రమేశ్‌ లేఖ

ABN , Publish Date - Nov 16 , 2026 | 02:16 PM

దేశంలో ఔషధాల ధరలను నియంత్రించేందుకు ప్రత్యేక జాతీయ విధానం తీసుకురావాలని రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేశ్‌ ప్రధాని నరేంద్ర మోదీని కోరారు.

ప్రధాని మోదీకి ఎంపీ లింగమనేని రమేశ్‌ లేఖ

అమరావతి: దేశంలో ఔషధాల ధరలను నియంత్రించేందుకు ప్రత్యేక జాతీయ విధానం తీసుకురావాలని రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేశ్‌ ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. ఈ మేరకు ఆయన ప్రధానమంత్రికి లేఖ రాశారు. క్యాన్సర్‌ మందులపై మార్జిన్లను తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న చర్యకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన.. గుండె, కిడ్నీ, మధుమేహ వ్యాధులకు వాడే మందుల ధరలు కూడా సామాన్యులకు అందుబాటులో ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.


అత్యవసర, ప్రాణాధార మందులపై విక్రయ మార్జిన్లకు పరిమితులు విధించాలని కోరారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో జనఔషధి కేంద్రాలను మరింత విస్తరించాలని సూచించారు. ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని రాష్ట్రాల ఆరోగ్య బీమా పథకాలతో అనుసంధానించాలని లేఖలో పేర్కొన్నారు.


పార్లమెంట్‌ తదుపరి సమావేశాల్లో ఔషధ ధరల అంశంపై వైద్యరంగ నిపుణులైన ఎంపీలతో ప్రత్యేకంగా చర్చించాలని లింగమనేని రమేశ్‌ ప్రధానిని కోరారు.


ఇవి కూడా చదవండి...

ఉద్యోగం కోసం మలేసియా వెళ్లి జైలుపాలైన కామారెడ్డి యువకుడు

ఏఐ దుర్వినియోగానికి చెక్ పెట్టండి.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి చిరంజీవి వినతి

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 16 , 2026 | 02:24 PM