సొంతవారినే పొట్టన పెట్టుకున్న వైసీపీ
ABN , Publish Date - Oct 07 , 2026 | 03:43 AM
సొంత పార్టీ నాయకులనే పొట్టనపెట్టుకునే సంస్కృతి గొడ్డలి పార్టీదని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖల మంత్రి సవిత ధ్వజమెత్తారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం ద్వారా అభివృద్ధిని అడ్డుకోవాలని కుట్రలు పన్నుతున్నారన్నారు.
అదే గొడ్డలి పార్టీ సంస్కృతి: మంత్రి సవిత
హిందూపురం, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): సొంత పార్టీ నాయకులనే పొట్టనపెట్టుకునే సంస్కృతి గొడ్డలి పార్టీదని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖల మంత్రి సవిత ధ్వజమెత్తారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం ద్వారా అభివృద్ధిని అడ్డుకోవాలని కుట్రలు పన్నుతున్నారన్నారు. దీనిని కూటమి ప్రభుత్వం సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. శ్రీసత్యసాయి జిల్లా గోరంట్లలో సొంత నిధులతో మంత్రి సవిత అన్న క్యాంటీన్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైసీపీ నాయకులు తీరు మార్చుకోకుంటే సంగతి తేలుస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. నోటికాడ అన్నం లాక్కున్న దుర్మార్గులు వైసీపీ నాయకులని, పేదల కడుపు నింపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. పెనుకొండలో వెయ్యి రోజులపాటు సొంత నిధులతో అన్న క్యాంటీన్ నిర్వహించామని, ఇప్పుడు గోరంట్లలో ప్రారంభించామని తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి..
అమరావతి పనుల్లో వేగం పెంచాలి.. ప్రతి నెల రూ. 2వేల కోట్ల పనులు పూర్తి చేయాలి: సీఎం
స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పోటీ చేసే స్థానాలు ఖరారు..!