Share News

మహిళల రక్షణే ప్రథమ కర్తవ్యం

ABN , Publish Date - Oct 07 , 2026 | 12:14 AM

మహిళల రక్షణే పోలీసుల ప్రథమ కర్తవ్యమని ఎస్పీ దామోదర్‌ అన్నారు.

మహిళల రక్షణే ప్రథమ కర్తవ్యం

  • ఎస్పీ దామోదర్‌

పూసపాటిరేగ, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): మహిళల రక్షణే పోలీసుల ప్రథమ కర్తవ్యమని ఎస్పీ దామోదర్‌ అన్నారు. స్థానిక పూసపాటిరేగ పోలీస్‌స్టేషన్‌ సమీపంలో మంగళవారం నిర్వహించిన త్రిశూల్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. విద్యార్థులు గంజాయి జోలికి వెళ్లొద్దని, తర్వాత పోలీసు కేసుల్లో ఇరుక్కొని ఇబ్బందులకు గురి కావల్సి వస్తోంద ని తెలిపారు. బాలికలు పోక్సో చట్టంపై తెలుసుకోవాలన్నారు. కష్టపడి చదివి తల్లిదండ్రులకు, మీ ప్రాంతానికి మంచిపేరు తీసుకురావాలని కోరారు. సోషల్‌ మీడియాకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఎస్‌.రాఘవలు, సీఐ నిమ్మకాయల శ్రీనివాసరావు, స్థానిక ఎస్‌ఐ అరుణ్‌కుమార్‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Oct 07 , 2026 | 12:14 AM