ఎన్టీఆర్ ట్రస్టు సీవోవోకు లోకేశ్ పరామర్శ
ABN , Publish Date - Sep 07 , 2026 | 06:45 AM
ఎన్టీఆర్ ట్రస్టు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో) అడుసుపల్లి గోపీని మంత్రి లోకేశ్ ఆదివారం పరామర్శించారు. తిరుపతి జిల్లా పాకాల మండలం అడుసుపల్లెకు చెందిన గోపి తండ్రి ఆంజనేయులు నాయుడు ఇటీవల మృతిచెందారు.
తిరుపతి(టీటీడీ), సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్ ట్రస్టు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో) అడుసుపల్లి గోపీని మంత్రి లోకేశ్ ఆదివారం పరామర్శించారు. తిరుపతి జిల్లా పాకాల మండలం అడుసుపల్లెకు చెందిన గోపి తండ్రి ఆంజనేయులు నాయుడు ఇటీవల మృతిచెందారు. ఈ నేపథ్యంలో గోపి నివాసానికి సాయంత్రం వచ్చిన లోకేశ్ ఆయనతో పాటు కుటుంబసభ్యులను పరామర్శించారు. ఆంజనేయులు చిత్రపటం వద్ద నివాళులర్పించారు. అక్కడి నుంచి చిత్తూరు వెళ్లిన లోకేశ్ ఇటీవల మృతిచెందిన టీడీపీ నాయకుడు వసంతకుమార్ ఇంటికి వెళ్లారు. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. లోకేశ్ వెంట టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కిలారు రాజేశ్, ఎమ్మెల్యేలు అమరనాథరెడ్డి, పులివర్తి నాని, గాలి భానుప్రకాష్, గురజాల జగన్మోహన్, కె.మురళీమోహన్, వీఎం థామస్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఉన్నారు.
ఈ వార్తలను కూడా చదవండి
వెంకటేశ్వరకాలనీలో కార్డన్‌సెర్చ్