Share News

పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి

ABN , Publish Date - Oct 03 , 2024 | 12:15 AM

పరిసరాలు పరి శుభ్రంగా ఉంచుకోవాలని జూని యర్‌ సివిల్‌ న్యాయాధికారి ఫరీష్‌ కుమార్‌ అన్నారు. స్వచ్ఛభారత్‌లో భాగంగా బుధవారం కోర్టు ఆవ రణలో న్యాయవాదు లతో కలిసి చెత్తలను తొలగించారు.

పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి
ఇచ్ఛాపురం: చెత్త తొలగిస్తున్న న్యాయాధికారి, న్యాయవాదులు

ఇచ్ఛాపురం: పరిసరాలు పరి శుభ్రంగా ఉంచుకోవాలని జూని యర్‌ సివిల్‌ న్యాయాధికారి ఫరీష్‌ కుమార్‌ అన్నారు. స్వచ్ఛభారత్‌లో భాగంగా బుధవారం కోర్టు ఆవ రణలో న్యాయవాదు లతో కలిసి చెత్తలను తొలగించారు. కార్యక్ర మంలో బార్‌ అసోసియేషన్‌ అధ్య క్షుడు ఎన్‌.రమణయ్యరెడ్డి, న్యాయ వాదులు ఆర్‌.దేవరాజ్‌రెడ్డి, దక్కత కృష్ణమూర్తిరెడ్డి, నాగరాజు పాత్రో, బైరాగిరెడ్డి, ప్రహ్లద్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

భావనపాడు తీరంలో స్వచ్ఛతా హీ సేవ

సంతబొమ్మాళి: నెహ్రూ యువ కేంద్ర అధ్వర్యంలో భావనపాడు సముద్రతీరంలో స్వచ్ఛ తా హీ సేవా కార్యక్రమం బుధవారం నిర్వహించారు. తీరం శుభ్రంగా ఉంటే పర్యాటకులు సందర్శిస్తారని ఎన్‌వైకే వలంటీర్లు కొయ్యాన మధు, రేవతి అన్నారు. తీరాన్ని పరిశుభ్రంగా ఉంచాలన్నారు.

ప్లాస్టిక్‌ రహిత సమాజం అవసరం

టెక్కలి: ప్లాస్టిక్‌ రహిత సమాజం అవసరమని ఆదిత్య ఇంజనీరింగ్‌ కళాశాల డైరెక్టర్‌ వీవీ నాగేశ్వరరావు అన్నారు. బుధవారం గాంధీ, లాల్‌ బహ దూర్‌ శాస్త్రి జయంతి సంద ర్భంగా కె.కొత్తూరు గ్రామంలో ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లు స్వచ్ఛత హీ సేవా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించి సేంద్రియాల వైపు దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్‌ పీవో మారుతీ ప్రసాద్‌, చీఫ్‌ వార్డెన్‌ డాక్టర్‌ జయమన్మథరావు, ఎంవీ రమణయ్య, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 03 , 2024 | 12:15 AM