మే డే వేళ ‘అన్నదాత’ ఆవేదన.. అప్పుల ఊబిలో దేశానికి వెన్నెముక!
ABN , Publish Date - May 01 , 2026 | 01:02 PM
శ్రామిక వర్గం తమ హక్కుల కోసం పోరాడిన స్మృత్యర్థం మే 1న 'మే డే' జరుపుకుంటున్నాం. కానీ సమాజానికి అన్నం పెట్టే రైతు నిత్యం శ్రమిస్తున్నా అప్పుల ఊబిలో కూరుకుపోయి ప్రాణాలు కోల్పోతూనే ఉన్నాడని 'ఏబీఎన్ ఆంధ్రజ్యోతి' డైరెక్టర్ భానుప్రకాశ్ కోగంటి అన్నారు.
ఆంధ్రజ్యోతి, మే 1: ప్రపంచవ్యాప్తంగా శ్రామిక వర్గం తమ హక్కుల కోసం పోరాడిన గౌరవార్థం నేడు 'మే డే' జరుపుకుంటున్నాం. కర్మాగారాల్లో పనిచేసే కార్మికులకు కనీసం పని గంటలు ఉంటాయి. కానీ సమాజానికి అన్నం పెట్టే రైతుల పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగా ఉంది. దేశ ప్రజల ఆకలి తీర్చడానికి సమయపాలన లేకుండా, ఎండనకా, వాననకా కఠోరంగా శ్రమిస్తున్న అన్నదాతలు ఇప్పటికీ అప్పుల ఊబిలో కూరుకుపోయి ప్రాణాలు కోల్పోతున్నారు.
నిరంతర శ్రమ.. నిత్యం భయం
'శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేదోయ్' అన్న శ్రీశ్రీ మాటలు రైతుల విషయంలో అక్షర సత్యాలు. అయితే.. ఏటా వారి అప్పులు, ఆత్మహత్యలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. భారతదేశానికి వెన్నెముక వంటి రైతులు నేడు ప్రమాదంలో ఉన్నారని, వారిని నిర్లక్ష్యం చేస్తే అది ప్రభుత్వాల మనుగడకే ప్రమాదమని 'ఏబీఎన్ ఆంధ్రజ్యోతి' డైరెక్టర్ భానుప్రకాశ్ కోగంటి 'ఎక్స్' వేదికగా గణాంకాలతో సహా హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి: