Share News

తాగునీటిలో సూపర్‌బగ్స్‌.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్ భాను కోగంటి ఏం చెప్పారంటే..

ABN , Publish Date - Apr 30 , 2026 | 09:07 PM

దేశవ్యాప్తంగా నగరాల్లో జనాభా తాకిడితో నీటి కాలుష్యం పెరిగిపోతోంది. మరీ ముఖ్యంగా మనం తాగే నీటిలో ప్రమాదకరమైన సూపర్‌బగ్స్ స్థాయిలు పెరిగిపోతున్నాయని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. ఈ అంశంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్ భాను ప్రకాశ్ కోగంటి స్పందించారు.

తాగునీటిలో సూపర్‌బగ్స్‌.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్ భాను కోగంటి ఏం చెప్పారంటే..
Bhanu Prakash Koganti

ఇంటర్నెట్ డెస్క్: దేశవ్యాప్తంగా నగరాల్లో జనాభా రోజురోజుకూ పెరిగిపోతోంది. జనాభా తాకిడితో నీటి కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. మరీ ముఖ్యంగా మనం తాగే నీటిలో ప్రమాదకరమైన సూపర్‌బగ్స్ స్థాయిలు పెరిగిపోతున్నాయని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. ఈ సూపర్ బగ్స్ ఎంతటి ప్రమాదకరమంటే.. యాంటీబయాటిక్స్‌కు కూడా లొంగవని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇదే విషయం ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ చేసిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ సూపర్‌బగ్స్ అంశంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్ భాను ప్రకాశ్ కోగంటి స్పందించారు.


సూపర్‌బగ్స్‌‌పై భాను ప్రకాశ్ కోగంటి పోస్ట్..

తాగునీటి కాలుష్యం, సూపర్‌బగ్స్‌పై ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ చేసిన తాజా అధ్యయనంపై ఏబీఎన్ డైరెక్టర్ భాను ప్రకాశ్ కోగంటి స్పందించారు. పెరుగుతోన్న నీటి కాలుష్యంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. 'సాఫ్ట్‌వేర్‌లో వచ్చే సూపర్‌ బగ్స్ గురించి వినే ఉంటాం.. కానీ, ఇప్పుడు అసలైన ముప్పు మనం తాగేనీళ్లలో ఉంది. ప్రతీ ఏటా నగరాలు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు గెలుచుకుంటున్నప్పటికీ, అక్కడి నీరు మాత్రం ప్రమాదకరంగా కలుషితమవుతూనే ఉంది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ చేసిన తాజా అధ్యయనంలో పలు భయంకరమైన విషయాలు వెల్లడయ్యాయి. పట్టణాల్లో వెలువడే మురికినీటిలో కేవలం 28 శాతం మాత్రమే శుద్ధి చేయబడుతోంది. మిగిలిన 72 శాతం నేరుగా నదులు, భూగర్భ జలాల్లో కలుస్తోంది. ఇది యాంటీబయాటిక్స్‌కూ లొంగని భయంకరమైన సూపర్‌బగ్స్ పెరగడానికి ప్రధాన కారణమవుతోంది' అంటూ పోస్టు పెట్టారు.


కీలక వివరాలు చెప్పిన జయశంకర్ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్..

నీటి కాలుష్యం, తాగు నీటిలో సూపర్‌బగ్స్‌ అంశంపై ఇటీవల అధ్యయనం చేసినట్లు ప్రిన్సిపల్ సైంటిస్ట్, ప్రొఫెసర్ అపర్ణ కోన తెలిపారు. ఈ మేరకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి ఆమె ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. నీటి కాలుష్య కారణాలు, నీటి శుద్ధీకరణ, సూపర్‌బగ్స్‌ పెరుగుదల, సూపర్‌బగ్స్‌ నియంత్రణ సహా అనేక అంశాలకు సంబంధించి ప్రొఫెసర్ అపర్ణ కీలక విషయాలు వివరించారు.


ఈ వార్తలు కూడా చదవండి

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీదే విజయం: టుడేస్ చాణక్య

మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. బార్గి డ్యాంలో పడవ బోల్తాపడి..

Updated Date - Apr 30 , 2026 | 09:07 PM