Share News

మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. బార్గి డ్యాంలో పడవ బోల్తాపడి..

ABN , Publish Date - Apr 30 , 2026 | 08:49 PM

మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్‌పూర్ జిల్లాలోని బార్గి డ్యాం వద్ద ఘోర ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తూ క్రూయిజ్ బోటు బోల్తాపడి నలుగురు మృతిచెందగా.. పలువురు గల్లంతయ్యారు

మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. బార్గి డ్యాంలో పడవ బోల్తాపడి..
Bargi Dam Accident

మధ్యప్రదేశ్: జబల్‌పూర్ జిల్లాలోని బార్గి డ్యాం వద్ద ఘోర ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తూ క్రూయిజ్ బోటు బోల్తాపడి నలుగురు మృతిచెందగా.. పలువురు గల్లంతయ్యారు. ఈ ఘటన బార్గి డ్యాం వద్ద ఈరోజు(గురువారం) సాయంత్రం చోటు చేసుకుంది. నర్మదా నదిపై ఉన్న బార్గి డ్యాం వద్దకు సుమారు 30 మంది పర్యాటకులు వెళ్లారు. వారిని ఎక్కించుకున్న పర్యాటక బోటు.. డ్యాం ప్రాంతంలో తిరిగేందుకు బయలుదేరింది.


అయితే, బోటు లోపలికి వెళ్లిన తర్వాత అకస్మాత్తుగా బలమైన గాలులు వీచాయి. దీంతో అదుపుతప్పిన బోటు.. ప్రయాణికులతో సహా మునిగిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. 15 మందిని భద్రతా సిబ్బంది కాపాడారు. బాధితులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన 11 మంది గల్లంతైనట్లుగా సమాచారం. వారి కోసం సహాయక బృందాలు, స్థానిక యంత్రాంగం గాలింపు చర్యలు చేపట్టాయి.


ఈ ఘటనపై జబల్‌పూర్ కలెక్టర్ రాఘవేంద్ర సింగ్ స్పందించారు. 15 మందిని రక్షించామని.. మిగతా వారిని కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ఆ పర్యాటక పడవలో సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించినట్లు ఆరోపణపలు వస్తున్నాయి. కాగా, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి

విజయం టీఎంసీదే.. ఎగ్జిట్ పోల్స్‌పై నిప్పులు చెరిగిన మమతా బెనర్జీ..

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీదే విజయం: టుడేస్ చాణక్య

Updated Date - Apr 30 , 2026 | 09:14 PM