నటి కరిష్మా కపూర్‌కు ఊరట! మాజీ భర్త ఆస్తుల విక్రయానికి కోర్టు బ్రేకులు
ABN , Publish Date - Apr 30 , 2026 | 04:13 PM
తన మాజీ భర్త, దివంగత వ్యాపారవేత్త సంజయ్ కపూర్ ఆస్తుల విషయంలో కోర్టును ఆశ్రయించిన బాలీవుడ్ నటి కరిష్మా కపూర్‌కు ఊరట దక్కింది. ఆయన ఆస్తులను విక్రయించడానికి వీలు లేదంటూ కోర్టు తాజాగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ వ్యాపారవేత్త సంజయ్ కపూర్ మరణం తరువాత కుటుంబంలో ఆస్తి తగాదాలు నెలకొన్న విషయం తెలిసందే. సంజయ్ కపూర్ ఆస్తుల విషయంలో కోర్టును ఆశ్రయించిన బాలీవుడ్ నటి కరిష్మా కపూర్, ఆమె సంతానానికి తాజాగా ఊరట దక్కింది. సంజయ్ కపూర్ ఆస్తులను విక్రయించకూడదని కోర్టు తాజాగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సంజయ్ కపూర్ ఆస్తులను అమ్మవద్దని, పరిరక్షించాలని ఆయన మూడవ భార్య ప్రియ సచ్‌దేవాను ఆదేశించింది. సంజయ్ బ్యాంక్ ఖాతాలను ప్రియ నిర్వహించకూడదని స్పష్టం చేసింది. సంజయ్ వీలునామాపై కరిష్మా లేవనెత్తిన అనుమానాలను తొలగించాల్సిన బాధ్యత ప్రియదేనని కూడా తేల్చిచెప్పింది.
సంజయ్ కపూర్ మరణం తరువాత ఆయన ఆస్తి విషయంలో వారసుల మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. దాదాపు రూ.30 వేల కోట్ల ఆస్తుల పంపకంపై సంజయ్ మాజీ భార్య కరిష్మా కపూర్, ఆమె సంతానం గతేడాది కోర్టును ఆశ్రయించారు. సంజయ్ వీలునామా ఫోర్జరీకి పాల్పడ్డారని ప్రియపై ఆరోపణలు గుప్పించారు. ఆయన ఆస్తుల పూర్తి వివరాలను కూడా ప్రియ కోర్టుకు వెల్లడించలేదని ఆరోపించారు. ప్రియ కోర్టుకు సమర్పించిన ఆస్తుల జాబితాలో పలు స్థిరాస్తుల ప్రస్తావన లేదని అన్నారు. ఈ నేపథ్యంలో ఆస్తుల విక్రయాన్ని నిలుపుదల చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
సంజయ్, కరిష్మాల వివాహం 2003లో జరిగింది. సంజయ్‌కు అది రెండవ వివాహం. ఆ దంపతులకు కూతురు సమైరా, కుమారుడు కియాన్ ఉన్నారు. ఆ జంట 2016లో విడాకులు తీసుకుంది. ఆ తరువాత సంజయ్ 2017లో ప్రియ సచ్‌దేవాను వివాహం చేసుకున్నారు. గతేడాది జూన్‌లో ఇంగ్లండ్‌లో ఉండగా ఆయనకు గుండెపోటు రావడంతో కన్నుమూశారు.
ఈ వార్తలనూ చదవండి:
కశ్మీర్‌ను పాక్ భూభాగంగా చూపిస్తూ మ్యాప్.. భారత్‌కు నేపాల్ ఎయిర్‌లైన్స్ క్షమాపణలు..
రూ.45 లక్షల కోసం కూతురి ఘాతుకం.. ప్రియుడితో కలిసి తల్లిని.