కశ్మీర్‌ను పాకిస్థాన్‌లో భాగంగా చూపిస్తూ మ్యాప్.. వివాదంపై భారత్‌కు నేపాల్ ఎయిర్‌లైన్స్ క్షమాపణలు..
ABN , Publish Date - Apr 30 , 2026 | 02:03 PM
మ్యాప్ వివాదంలో చిక్కుకున్న నేపాల్ ఎయిర్‌లైన్స్.. భారత్‌కు క్షమాపణలు చెప్పింది. జమ్మూ, కశ్మీర్‌ను పాకిస్థాన్‌లో భాగంగా చూపుతూ ఉన్న తన నెట్‌వర్క్ మ్యాప్‌ను నేపాల్ ఎయిర్‌లైన్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
మ్యాప్ వివాదంలో చిక్కుకున్న నేపాల్ ఎయిర్‌లైన్స్.. భారత్‌కు క్షమాపణలు చెప్పింది. జమ్మూ, కశ్మీర్‌ను పాకిస్థాన్‌లో భాగంగా చూపుతూ ఉన్న తన నెట్‌వర్క్ మ్యాప్‌ను నేపాల్ ఎయిర్‌లైన్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. క్షణాల్లో ఆ మ్యాప్ వైరల్ అయి విమర్శలు వెల్లువెత్తాయి. వెంటనే స్పందించిన నేపాల్ ఎయిర్‌లైన్స్ నష్ట నివారణ చర్యలకు దిగింది. భారత్‌కు క్షమాపణలు చెప్పింది (Nepal Airlines controversy).
'మా సోషల్ మీడియా ఛానెళ్లలో ఇటీవల పంచుకున్న నెట్‌వర్క్ మ్యాప్‌లోని లోపానికి మేము హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాము. ఆ మ్యాప్‌లో అంతర్జాతీయ సరిహద్దులకు సంబంధించి చాలా పెద్ద నిర్మాణ దోషాలు ఉన్నాయి. అవి నేపాల్, నేపాల్ ఎయిర్‌లైన్స్ అధికారిక అభిప్రాయాన్ని ప్రతిబింబించవు' అని నేపాల్ ఎయిర్‌లైన్స్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. అంతకు ముందు పెట్టిన నెట్‌వర్క్ మ్యాప్ పోస్ట్‌ను డిలీట్ చేసింది. జరిగిన తప్పిదంపై అంతర్గత సమీక్ష నిర్వహిస్తున్నట్టు వెల్లడించింది (Jammu Kashmir map issue).
కాగా, నేపాల్ ఎయిర్‌లైన్స్‌పై సోషల్ మీడియాలో భారతీయులు భారీగా ట్రోలింగ్‌కు దిగారు (Nepal Airlines apology). 'బాయ్‌కాట్ నేపాల్ ఎయిర్‌లైన్స్' హ్యాష్‌ట్యాగ్‌ను వైరల్ చేశారు. భారత విదేశాంగ శాఖ, విమానయాన మంత్రిత్వ శాఖలు వెంటనే నేపాల్‌పై దౌత్యపరమైన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్లు చేశారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసినట్టు ఉందని కామెంట్లు చేశారు. కాగా, ఇప్పటివరకు ఈ ఘటనపై భారత విదేశాంగ శాఖ స్పందించలేదు.
ఇవి కూడా చదవండి..
బంగారం కొనాలనుకుంటున్నారా.. మరింత తగ్గిన ధరలు..
రష్యాలో మరో ఆయిల్ కేంద్రంపై దాడి.. డ్రోన్ శక్తిని చూపిస్తున్న ఉక్రెయిన్..