Share News

‘మావిగన్’ అంటే అర్థం ఇదేనా? జగన్: మంత్రి లోకేశ్

ABN , Publish Date - Apr 08 , 2026 | 08:18 PM

వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన ‘మావిగన్’ రాజధాని ప్రతిపాద ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా మంత్రి లోకేశ్ మావిగన్ అర్థం ఇదేనా జగన్ అంటూ ట్వీట్ చేశారు. వివరాల్లోకి వెళితే..

‘మావిగన్’ అంటే అర్థం ఇదేనా? జగన్: మంత్రి లోకేశ్
Mavigan Controversy

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ‘మావిగన్’ (MAVI GUN) అంశం ఇప్పుడు అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపాదించిన ఈ అంశంప రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ వైఖరిని ఎండగడుతూ లోకేశ్ చేసిన ట్విట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.


ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత నేపథ్యంలో అటు అధికార పార్టీ నేతలు, ఏపీ ప్రజలు ఎంతో సంతోషంలో మునిగిపోతుంటే.. వైసీపీ అధినేత జగన్ మరోసారి తన ‘మావిగన్’ వ్యాఖ్యను సమర్థించుకున్నారు. తాడేపల్లిలో ఆ పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే జగన్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి నారా లోకేశ్ సెటైర్లు వేశారు. మావిగన్ అంటే.. ‘మా’ అంటే మాయ అని, ‘వి’ అంటే విధ్వంసం అని, ‘గన్’ అంటే గందరగోళం, గన్ కల్చర్ ఇదేనా జగన్ మీ ప్లాన్ - బి అంటూ మంత్రి లోకేశ్ ట్విట్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

కష్టపడిన వారిని గుర్తించడమే టీడీపీ సిద్ధాంతం: మంత్రి లోకేశ్..

ఇలా చేస్తే ఉపేక్షించేది లేదు.. టీడీపీ నేతలపై మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం

Updated Date - Apr 08 , 2026 | 08:26 PM