Share News

ఏపీ డ్రైవర్‌పై కర్ణాటక బస్సు కండక్టర్ దాడి.. బస్సు ఎక్కించి మరీ..

ABN , Publish Date - Mar 22 , 2026 | 10:20 AM

ఏపీకి చెందిన పీలేరు ఆర్టీసు బస్సు, కర్ణాటకకు చెందిన ఓ బస్సు శ్రీశైలం శిఖరం చెక్ పోస్ట్ రోడ్డులో వెళ్తున్నాయి. అయితే, కర్ణాటక బస్సు వరుస క్రమంలో రాకపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

ఏపీ డ్రైవర్‌పై కర్ణాటక బస్సు కండక్టర్ దాడి.. బస్సు ఎక్కించి మరీ..
Srisailam Bus Attack

నంద్యాల: శ్రీశైలం శిఖర చెక్ పోస్ట్(Srisailam Checkpost) వద్ద కర్ణాటక బస్సు (Karnataka Bus) కండక్టర్, ప్రయాణీకులు రెచ్చిపోయారు. పీలేరు ఆర్టీసీ బస్సు డ్రైవర్ చాంద్ బాషాపై విచక్షణారహితంగా దాడి (Attack on AP Bus Driver) చేశారు. బాధిత డ్రైవర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన ఏపీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.


అసలేం జరిగిందంటే..

ఏపీకి చెందిన పీలేరు ఆర్టీసు బస్సు, కర్ణాటకకు చెందిన ఓ బస్సు శ్రీశైలం శిఖరం చెక్ పోస్ట్ రోడ్డులో వెళ్తున్నాయి. అయితే, కర్ణాటక బస్సు వరుస క్రమంలో రాకపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో బస్సును ఎందుకు అడ్డదిడ్డంగా నడుపుతున్నారంటూ కర్ణాటక డ్రైవర్‌ని ఏపీ డ్రైవర్ చాంద్ బాషా ప్రశ్నించారు. ఈ విషయం కాస్తా వివాదానికి దారి తీసింది. ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. మధ్యలో కర్ణాటక బస్సు కండక్టర్, ఆ బస్సులోని కొంతమంది ప్రయాణికులు రెచ్చిపోయారు.


చాంద్ బాషాని తమ బస్సులోకి బలవంతంగా ఎక్కించి దోర్నాల వరకూ దాడి చేస్తూ తీసుకెళ్లారు. విపరీతంగా కొట్టి అక్కడ వదిలిపెట్టారు. ఈ ఘటనతో నిర్ఘాంతపోయిన బాషా వెంటనే దోర్నాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు బస్సును వెంబడించి మరీ వారిని పట్టుకున్నారు. కండక్టర్‌తోపాటు మరో ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురి మృతి..

ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు షాక్.. భారీగా నగదు మాయం

Updated Date - Mar 22 , 2026 | 10:47 AM