Share News

నంద్యాలలో ఫుడ్ పాయిజన్.. 60 మందికి అస్వస్థత

ABN , Publish Date - Mar 24 , 2026 | 10:24 AM

నంద్యాలలోని వైఎస్ఆర్ నగర్ బుడగ జంగాల కాలనీలో ఫుడ్ పాయిజన్ కలకలం రేగింది. వివాహంలో మిగిలిన ఆహారాన్ని బుడగ జంగాల కాలనీ వాసులకు పెళ్లి తరఫు వారు పంచిపెట్టారు. అయితే ఫుడ్ పాయిజన్ కావడంతో పలువురు అస్వస్థతకు గురయ్యారు.

నంద్యాలలో ఫుడ్ పాయిజన్.. 60 మందికి అస్వస్థత

నంద్యాల, మార్చి24: నంద్యాలలోని వైఎస్ఆర్ నగర్ బుడగ జంగాల కాలనీలో ఫుడ్ పాయిజన్ కలకలం రేగింది. వివాహంలో మిగిలిన ఆహారాన్ని బుడగ జంగాల కాలనీ వాసులకు పెళ్లి తరఫు వారు పంచిపెట్టారు. ఈ ఆహారాన్ని తిన్న కాలనీలోని 60 మంది అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని చికిత్స నిమిత్తం నంద్యాలలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో 10 మంది చిన్నారులు ఉన్నారు. బాధితుల్లో ఒక మహిళ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే మున్సిపల్ కమిషనర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఆసుపత్రికి చేరుకుని, పరిస్థితిని సమీక్షించారు.


ఈ ఘటనపై బాధిత కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. ఇది ఫుడ్ పాయిజనా? లేకుంటే.. తాగు నీటిలో ఏమైనా తేడా ఉందా? అనే కోణంలో పరీక్షలు నిర్వహిస్తున్నామని అధికారులు వివరించారు. ఈ ఘటనపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బాధిత కుటుంబ సభ్యులకు అధికారులు స్పష్టం చేశారు. బాధితులకు మరింత మెరుగైన వైద్యం అందిస్తామని ఈ సందర్భంగా వారికి అధికారులు భరోసా ఇచ్చారు.


ఘటనపై మంత్రి జనార్దన్ రెడ్డి ఆరా..

నంద్యాలలో ఫుడ్ పాయిజన్ ఘటనపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆరా తీశారు. ఈ ఘటనలో అస్వస్థతకు గురైన బాధితుల ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటూ స్థానిక వైద్యాధికారులను ఆరా తీశారు. బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించాలంటూ జిల్లా ఉన్నతాధికారులను మంత్రి జనార్దన్ రెడ్డి ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అమరావతిపై ఎవరు కుట్రలు చేసినా ఉపేక్షించేది లేదు: మంత్రి అనిత

నేటి నుంచి కుప్పంలో పర్యటించనున్న భువనమ్మ

For More AP News And Telugu News

Updated Date - Mar 24 , 2026 | 12:02 PM