Share News

20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం: టీజీ భరత్

ABN , Publish Date - Jun 08 , 2026 | 02:46 PM

చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువుదీరిన ఈ రెండేళ్లలో కర్నూలు జిల్లాలో ఎంతో అభివృద్ధి జరిగిందని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా వెల్లడించారు.

20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం: టీజీ భరత్
TG Bharath

కర్నూలు, జూన్08: చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువుదీరిన ఈ రెండేళ్లలో కర్నూలు జిల్లాలో ఎంతో అభివృద్ధి జరిగిందని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా వెల్లడించారు. సోమవారం కర్నూలు నగరంలో కాపు, బలిజ సేవ సంఘం ప్రతిభ పురస్కారాల ప్రదానం కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్ గుప్తా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భరత్ గుప్తా మాట్లాడుతూ.. జిల్లాలోని ఓర్వకల్లుకు వేల కోట్ల రూపాయిల పెట్టుబడులు తీసుకొచ్చామన్నారు. మొదటగా రిలయన్స్ ప్రాజెక్టు రూ.2,500 కోట్లు అనుకుంటే.. అది ఇప్పుడు రూ.6 వేల కోట్లు దాటిందని తెలిపారు.


మరో రూ.3 వేల కోట్ల ప్రాజెక్టు చేపట్టేందుకు రిలయన్స్ ముందుకొచ్చిందని ఆయన వివరించారు. జగన్ ప్రభుత్వ హయాంలో ఓర్వకల్లుకు వాటర్ లైన్ తీసుకురాలేదని విమర్శించారు. కానీ ఇప్పుడు వాటర్ లైన్‌ను తాము తీసుకొస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో జైరాజ్ ఇస్పాత్ స్టీల్ కంపెనీని ఎన్నో ఇబ్బందులు పెట్టారని.. కానీ తమపై నమ్మకంతో ఇప్పుడు రూ. 6 వేల కోట్లతో ఆ కంపెనీని యాజమాన్యం విస్తరిస్తుందని చెప్పారు.


రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా తాము పని చేస్తున్నామని స్పష్టం చేశారు. దీనిపై సీఎం చంద్రబాబుతోపాటు మంత్రి లోకేశ్ నిరంతరం సమీక్షిస్తున్నారన్నారు. జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకోవాలని యువతకు మంత్రి టీజీ భరత్ సూచించారు. యువతకు స్కిల్స్ నేర్పించేందుకు ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు.


అవినీతి మచ్చ లేకుండా తమ కుటుంబం రాజకీయాలు చేస్తోందన్నారు. మంచి చేసే నాయకులెవరో, మాటలు చెప్పే నాయకులెవరో గ్రహించాలంటూ ఈ సందర్భంగా ప్రజలకు మంత్రి భరత్ గుప్తా స్పష్టం చేశారు. కర్నూలులో ప్రతి వార్డులో ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తున్నానని మంత్రి టీజీ భరత్ గుప్తా వివరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆగస్ట్ 15 నాటికి సంజీవని పథకం తీసుకొస్తాం: సీఎం చంద్రబాబు

ప్రతి నియోజకవర్గంలో అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేస్తాం: భట్టి విక్రమార్క

For More AP News And Telugu News

Updated Date - Jun 08 , 2026 | 02:53 PM