Share News

శ్రీశైలంలో మరోసారి బయటపడ్డ సైబర్ నేరగాళ్ల దందా..

ABN , Publish Date - May 09 , 2026 | 08:08 PM

శ్రీశైలంలో నకిలీ వెబ్‌సైట్ ద్వారా భక్తులను మోసం చేసిన ఘటన కలకలం రేపింది. ఢిల్లీకి చెందిన 27 మంది భక్తులను సైబర్ నేరగాళ్లు వసతి బుకింగ్ పేరుతో మోసానికి పాల్పడ్డారు.

 శ్రీశైలంలో మరోసారి బయటపడ్డ సైబర్ నేరగాళ్ల దందా..
Srisailam Fake Website Scam

నంద్యాల: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో మరోసారి సైబర్ నేరగాళ్ల నకిలీ వెబ్‌సైట్ల దందా బయటపడింది. ఢిల్లీకి చెందిన 27 మంది భక్తులను సైబర్ కేటుగాళ్లు మోసం చేసిన ఘటన కలకలం రేపుతోంది.


భక్తులు వసతి కోసం 'మల్లికార్జున సదన్' పేరుతో ఉన్న నకిలీ వెబ్‌సైట్ ద్వారా రూమ్స్ బుక్ చేసుకున్నారు. ఫేక్ ఐడితో భక్తుల నుంచి రూ.15,000 వసూలు చేసినట్లు తెలిసింది. ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేసిన తర్వాత భక్తులు శ్రీశైలం చేరుకున్నప్పుడు అసలు విషయం బయటపడింది. మల్లికార్జున సదన్ వద్దకు చేరుకున్న భక్తులు తమ బుకింగ్‌లు రికార్డులో లేకపోవడంతో మోసపోయినట్లు గుర్తించారు. వెంటనే వారు ఆలయ అధికారులను, పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేశారు.


మోసపోయిన భక్తులకు ఉచితంగా దర్శనం..

గతంలో కూడా ఇదే మల్లికార్జున సదన్ పేరుతో నకిలీ వెబ్‌సైట్‌లు సృష్టించి భక్తులను మోసం చేశారు. సైబర్ నేరగాళ్లు మళ్లీ అదే విధంగా భక్తులను టార్గెట్ చేయడం ఆందోళన కలిగిస్తోంది. సైబర్ కేటుగళ్ళ చేతిలో మోసపోయిన 27 భక్తులకు ఉచితంగా దర్శనం, వసతి కల్పించారు ఆలయ ఈవో శ్రీనివాసరావు.


ఇవి కూడా చదవండి...

మద్యం మత్తులో కొడుకును హత్య చేసిన తండ్రి

సర్కిల్‌కు టిప్పు సుల్తాన్ పేరు.. కడపలో ఉద్రిక్తం

Updated Date - May 09 , 2026 | 08:16 PM