Share News

కర్నూలులో విషాదం.. ఫైనాన్స్ వేధింపులు భరించలేక కుటుంబం ఆత్మహత్యాయత్నం

ABN , Publish Date - Jul 29 , 2026 | 06:53 PM

కర్నూలు జిల్లాలో ఓ ఫైనాన్స్ సంస్థ వేధింపులు తట్టుకోలేక దంపతులు ఇద్దరు చిన్నారులతో కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

కర్నూలులో విషాదం.. ఫైనాన్స్ వేధింపులు భరించలేక కుటుంబం ఆత్మహత్యాయత్నం
Andhra Pradesh News

కర్నూలు జిల్లా, జులై 29: నందికొట్కూరు మండలం మల్యాలలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మల్యాల గ్రామానికి చెందిన రామసుబ్బయ్య(38), భార్య మాధవి (34), కుమార్తెలు తేజ (9), అక్షయ (7) కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఓ ప్రైవేట్ వెహికల్ ఫైనాన్స్ సంస్థ వేధింపులు భరించలేక ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం రామసుబ్బయ్యకు చెందిన బొలెరో వాహనాన్ని ఫైనాన్స్ కంపెనీ స్వాధీనం చేసుకోవడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం పాములపాడు మండలం ఎర్రగూడూరు సమీపంలో భార్య, పిల్లలను వెంట తీసుకెళ్లి ఈ ఘోర నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.


స్థానికులు గమనించి వెంటనే బాధితులను కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రామసుబ్బయ్య, మాధవి, చిన్న కుమార్తె అక్షయ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పెద్ద కుమార్తె తేజ చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యాయత్నానికి దారితీసిన పరిస్థితులు, ఫైనాన్స్ సంస్థ ప్రతినిధుల పాత్ర, వేధింపుల ఆరోపణలపై విచారణ కొనసాగుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి:

ఫిర్యాదు చేసేందుకు వెళితే సీఐ రేప్‌ చేశారు!

సిగ్గుతో తలదించుకుంటున్నా.. క్షమించండి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 29 , 2026 | 07:04 PM