కర్నూలులో దొంగస్వామి బాగోతం.. పూజల పేరుతో ఇంట్లో చోరీలు
ABN , Publish Date - Nov 07 , 2026 | 12:58 PM
కర్నూలు జిల్లాలో దొంగస్వామి ఉదంతం కలకలం రేపింది. పూజల పేరుతో ఇంట్లోకి ప్రవేశించి.. దొంగతనాలు చేస్తున్న స్వామీజీ గుట్టును ఓ కుటుంబం బయటపెట్టింది.
కర్నూలు, నవంబర్ 7: నమ్మేవాళ్లు ఉంటే.. మోసం చేసేవాళ్లకు లోటు ఉండదన్నట్లు.. ఓ వ్యక్తి సులువుగా డబ్బు సంపాదించడానికి స్వామీజీ అవతారమెత్తాడు. చివరికి పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళితే..
పోలీసులు, స్థానికులు కథనం ప్రకారం.. కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరులో దొంగ స్వామికి ఓ కుటుంబం దేహశుద్ధి చేసింది. గొప్ప స్వామీజీనని చెప్పుకుంటూ.. ఎవరికీ అనుమానం రాకుండా పూజల పేర్లతో ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఆపై ఆ ఇంట్లో చోరీకి పాల్పడతాడు. అయితే.. ఈ సారి మాత్రం దొంగ స్వామి ప్లాన్ రివర్స్ అయింది. ఎప్పటిలాగానే.. పూజ చేయడానికి ఓ ఇంట్లోకి వెళ్లాడు. పూజ పేరుతో డబ్బు, నగదు కొట్టేస్తుండడంతో గమనించిన కుటుంబసభ్యులు.. గట్టిగా కేకలు వేశారు. దీంతో ఇరుగుపొరుగు వారు వచ్చి దొంగ స్వామిని పట్టుకుని దేహశుద్ధి చేశారు.
ఇవి కూడా చదవండి...
బ్యాలెట్ బాక్సులో గ్రామ సమస్యల స్లిప్పులు.. పల్నాడులో ఆసక్తికర సన్నివేశం
ఏపీ పరిషత్ ఎన్నికల సీసీటీవీ ఫుటేజ్ 60 రోజులు భద్రపరుస్తాం: ఎస్‌ఈసీ అనిల్ చంద్ర
Read Latest AP News And Telugu News