బొత్సకు అస్వస్థత.. హైదరాబాద్‌కు తరలింపు
ABN , Publish Date - Feb 27 , 2026 | 02:04 PM
వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను వెంటనే హైదరాబాద్‌కు తరలించారు.
అమరావతి, ఫిబ్రవరి 27: వైసీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) అస్వస్థతకు గురయ్యారు. నిన్న (గురువారం) రాత్రి ఆయన అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్‌కు తరలించారు. హైదరాబాద్‌లోని సిటీ న్యూరో ఆసుపత్రిలో బొత్స సత్యనారాయణ చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం బొత్స ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
బొత్స స్పందన..
తన ఆరోగ్యంపై మీడియాలో వస్తున్న వార్తలపై బొత్స సత్యనారాయణ స్పందించారు. ‘నా ఆరోగ్యంపై ఆందోళన అనవసరం. నేను ఆరోగ్యంగానే ఉన్నాను. రొటీన్ చెకప్‌లో భాగంగా ఆస్పత్రికి వచ్చాను’ అంటూ మాజీ మంత్రి స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
ఆయేషా మీరా అవశేషాల అప్పగింత.. తెనాలికి బయలుదేరిన తల్లిదండ్రులు
మండలి ఛైర్మన్‌ను కలిసిన మంత్రులు.. విషయం ఇదే
Read Latest AP News And Telugu News