Share News

జగన్ నాతో నీతులు చెప్పించుకునే స్థాయికి దిగజారారు: దస్తగిరి

ABN , Publish Date - Sep 08 , 2026 | 02:59 PM

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి అమరావతికి వచ్చారు. తనను ఇబ్బంది పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబును కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు దస్తగిరి దంపతులు అమరావతికి చేరుకున్నారు.

జగన్ నాతో నీతులు చెప్పించుకునే స్థాయికి దిగజారారు: దస్తగిరి
Dastagiri

అమరావతి, సెప్టెంబర్ 8: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి అమరావతికి వచ్చారు. తనను ఇబ్బంది పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబును కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు దస్తగిరి దంపతులు అమరావతికి వచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో తనను చంపేస్తానని బెదిరించిన అధికారులే ఇప్పటికీ ఇబ్బంది పెడుతున్నారంటూ దస్తగిరి వ్యాఖ్యానించారు. జగన్ తనతో కూడా నీతులు చెప్పించుకునే స్థాయికి దిగ జారారంటూ దుయ్యబట్టారు. రాష్ట్రం గురించి మాట్లాడే ముందు సొంత బాబాయ్ కూతురికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.


వివేకా కేసులో వాస్తవాలు, మనీలాండరింగ్‌పై సీఎంకు వివరాలు అందిస్తానని దస్తగిరి తెలిపారు. సిద్దార్థ్ లూథ్రా వద్ద తాను వకాలత్ తీసుకున్నట్టు నిరూపిస్తే జైలుకు వెళ్లేందుకు సిద్ధమని.. నిరూపించలేకపోతే జగన్ రాజకీయాలు వదులుకుంటారా అంటూ సవాల్ విసిరారు. వివేకా కేసులో జగన్, భారతి దర్యాప్తు సంస్థలకు సహకరించాలని దస్తగిరి కోరారు.


పులివెందులలో మాకు ప్రాణభయం ఉంది: షేక్ షభానా

బాబాయ్‌కి, సునీతమ్మకు, దస్తగిరికి న్యాయం చేయాలని చంద్రబాబును కోరుతున్నామని దస్తగిరి భార్య షేక్ షభానా అన్నారు. సీఎంను కలిసి తమ గోడు చెప్పుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. పులివెందులకు వెళ్లాలంటే భయంగా ఉందని.. అక్కడ ప్రాణభయం ఉందన్నారు. తమపై ఉన్న కేసుల గురించి కాకుండా.. వివేకా కేసులో న్యాయం చేయాలని షేక్ షభానా విజ్ఞప్తి చేశారు.


ఇవి కూడా చదవండి...

స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు: హరీశ్ రావు

వీసా స్కాం కేసులో పోలీసు విచారణకు రమానందన

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 08 , 2026 | 03:26 PM