Home » Viveka Case Approver Dastagiri
Telangana: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. శుక్రవారం ఉదయం వివేక హత్య కేసుపై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణకు కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి హాజరయ్యారు. అలాగే చంచల్‌గూడ జైలులో ఉన్న నలుగురు నిందితులను కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసులు విచారణకు హాజరుపర్చారు.
నాంపల్లి సీబీఐ కోర్టులో మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి మరో పిటిషన్ దాఖలు చేశారు. తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని దస్తగిరి పిటిషన్లో పేర్కొన్నారు. తన తండ్రిని ఏపీ సీఎం జగన్ రెడ్డి, సతీమణి భారతి, దేవి రెడ్డి శివశంకర్ రెడ్డి, అతని కుమారుడు చైతన్య రెడ్డి అనుచరులు దాడి చేశారని తెలిపారు.
మాజీ మంత్రి, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న వివేకానంద రెడ్డి హత్య కేసుపై నాంపల్లి సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. విచారణకు ఎంపీ అవినాష్ రెడ్డి, అప్రూవర్‌గా మారిన దస్తగిరి హాజరయ్యారు. జ్యూడిషల్ రిమాండ్‌లో ఉన్న ఎర్ర గంగిరెడ్డి, భాస్కర్ రెడ్డి ఉదయ్ కుమార్, సునీల్ యాదవ్, శివశంకర్ రెడ్డిని పోలీసులు కోర్టు ముందు హాజరు పరిచారు.
వివేక హత్య కేసులో (Viveka Murder Case) అప్రూవర్‌గా మారిన దస్తగిరిని మరోసారి ప్రలోభానికి గురిచేశారు. సీబీఐ(CBI) ఎస్పీ రామ్ సింగ్ కొట్టి అప్రూవర్‌గా మార్చాడని చెప్పాలంటూ తీవ్ర ఒత్తిడి చేశారు. అలా చెబితే ఏకంగా రూ.20 కోట్లు అడ్వాన్స్‌గా ఇస్తామంటూ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి ఆఫర్ చేశారు. దస్తగిరి జైలులో ఉన్న సమయంలో చైతన్య రెడ్డి డాక్టర్‌గా వెళ్లి జైల్లో ప్రలాభాలకు గురిచేశాడని సీబీఐ కోర్టుకు దస్తగిరి వెల్లడించాడు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో 259వ సాక్షిగా వైఎస్ షర్మిల వాంగ్మూలాన్ని కోర్టుకు సీబీఐ సమర్పించింది. అలాగే మరికొంత మంది సాక్షుల వాంగ్మూలాలను కూడా కోర్టుకు సీబీఐ సమర్పించింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Viveka Case) కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి (MP Avinash Reddy) సీబీఐ (CBI) మరోసారి నోటీసులు జారీ చేసింది.
మాజీమంత్రి వివేకానందరెడ్డి (Former Minister Vivekananda Reddy) హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి వాచ్మెన్ రంగన్న (Watchman Ranganna)ను అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా ఉన్న దస్తగిరి ఇంటికి సీబీఐ అధికారులు చేరుకున్నారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు దస్తగిరి అప్రూవర్‌గా మారడాన్ని సవాల్ చేస్తూ వైఎస్ భాస్కర్‌రెడ్డి...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి కడప జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.