Share News

మహిళా ఎస్ఐ కుటుంబానికి వేధింపులు.. యువకుల అరెస్ట్

ABN , Publish Date - Oct 05 , 2026 | 11:30 AM

మహిళా ఎస్‌ఐ కుటుంబాన్ని ఆకతాయిలు వేధింపులకు గురి చేశారు. దీంతో ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆకతాయిలు ఇద్దరు గంజాయితోపాటు మద్యం సేవించినట్లు పోలీసులు గుర్తించారు.

మహిళా ఎస్ఐ కుటుంబానికి వేధింపులు.. యువకుల అరెస్ట్

విజయవాడ, అక్టోబర్ 05: మహిళా ఎస్‌ఐ కుటుంబాన్ని ఆకతాయిలు వేధింపులకు గురి చేశారు. దీంతో ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆకతాయిలు ఇద్దరు గంజాయితోపాటు మద్యం సేవించినట్లు పోలీసులు గుర్తించారు. వీరిపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రశ్నిస్తున్నారు.. విజయవాడకు చెందిన ఎస్ఐ ప్రమీలా కుటుంబం కారులో గుడ్లవల్లేరు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో విజయవాడ నగరంలో వారి కారును బైక్‌పై ఆకతాయిలు వెంబడించారు.


కారును వెంబడిస్తూ వీడియో తీస్తుండడంపై వారిని ఎస్ఐ ప్రమీలా ప్రశ్నించారు. దీంతో ఆమెను మద్యం మత్తులో వారు దూషించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నగర పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని.. ఆకతాయిలు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వారికి బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహించారు. వారు మద్యంతోపాటు గంజాయి తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ఇవి కూడా చదవండి...

పేట్ బషీరాబాద్‌లో వ్యాపారవేత్త అనుమానాస్పద మృతి.. కేసు నమోదు

ఉగ్రవాదులకు నిధులు సమకూర్చారంటూ వృద్ధుడికి బెదిరింపులు.. లక్షల్లో వసూలు

Updated Date - Oct 05 , 2026 | 12:48 PM