అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తాం: కలెక్టర్ లక్ష్మీశ..
ABN , Publish Date - May 14 , 2026 | 08:22 PM
ఈ నెల 18న అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలో వైభవంగా వేడుకలు నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. బాపు మ్యూజియంలోని విక్టోరియా హాల్‌లో నిర్వహించే లేజర్ షోకు ప్రజలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు తెలిపారు.
విజయవాడ: ఈ నెల 18న అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలో వైభవంగా వేడుకలు నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. నగరంలోని చరిత్రాత్మక బాపు మ్యూజియం కేంద్రంగా ఆ రోజున ఎన్టీఆర్ జిల్లా టూరిజం కౌన్సిల్, ఆర్కియాలజీ విభాగం, ఆంధ్రప్రదేశ్ టూరిజం, విజయవాడ ఉత్సవ కమిటీ సంయుక్తంగా కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
1887లో స్థాపించిన బాపు మ్యూజియం స్వాతంత్ర్యోద్యమ చరిత్రకు నిలువెత్తు సాక్ష్యమని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. భారత జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య.. మహాత్మా గాంధీకి జాతీయ పతాకాన్ని అందించిన చారిత్రక ప్రదేశంగా ఈ మ్యూజియానికి ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం సందర్భంగా బాపు మ్యూజియంలోని విక్టోరియా హాల్‌లో నిర్వహించే లేజర్ షోకు ప్రజలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు తెలిపారు.
‘సాంకేతికత, డిజిటలైజేషన్, మ్యూజియంల భవిష్యత్తు’ అనే అంశంపై నిపుణులతో ప్రత్యేక చర్చా కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. విద్యార్థులతో సంగీత, వోకల్ ప్రదర్శనలు ఆకట్టుకునేలా ఉంటాయని తెలిపారు. సాయంత్రం మున్సిపల్ స్టేడియం వద్ద భారీ స్థాయిలో ‘లైవ్ మ్యూజికల్ కాన్సర్ట్’ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 14 మ్యూజియాల్లో కూడా అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై పరువు నష్టం దావా వేస్తా.. మంత్రి వార్నింగ్
ట్రాన్స్‌జెండర్లకు గుర్తింపు కార్డులు, సింగిల్ రేషన్ కార్డులు: మంత్రి డీబీవీ స్వామి