దుర్గమ్మ ఆలయ ఘాట్ రోడ్డు మూసివేత.. భక్తులకు అలర్ట్
ABN , Publish Date - May 25 , 2026 | 09:41 PM
ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీకనకదుర్గమ్మ ఆలయ ఘాట్ రోడ్డును తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు దేవస్థానం ఉన్నతాధికారులు సోమవారం విజయవాడలో వెల్లడించారు.
విజయవాడ, మే 25: ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీకనకదుర్గమ్మ ఆలయ ఘాట్ రోడ్డును తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు దేవస్థానం ఉన్నతాధికారులు సోమవారం విజయవాడలో వెల్లడించారు. అత్యవసర మరమ్మతు పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఈ ఆంక్షలు మంగళవారం నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. ఈ ఘాట్ రోడ్డు మూసివేత సమయంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.
అమ్మవారి దర్శనం కోసం ఇంద్రకీలాద్రిపైకి వెళ్లాలంటే.. కనకదుర్గ నగర్ మార్గం (బ్రాహ్మణ వీధి) ద్వారా కొండపైకి చేరుకోవచ్చునన్నారు. మెట్ల మార్గం లేదా లిఫ్ట్ సౌకర్యాన్ని కూడా వినియోగించుకోవచ్చని స్పష్టం చేశారు. మే 26వ తేదీ నుంచి జూన్12వ తేదీ వరకూ ఈ ఘాట్ రోడ్డు మూసి వేస్తామని శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి.. '
విశాఖ ఉక్కు భూములు ఆక్రమించాలని జగన్ కుట్ర: మంత్రి అచ్చెన్నాయుడు
మహానాడుకు వైసీపీ మీటింగ్ దిష్టి చుక్క లాంటిది: మంత్రి రాంప్రసాద్
Read Latest AP News And Telugu News