Share News

విశాఖ ఉక్కు భూములు ఆక్రమించాలని జగన్ కుట్ర: మంత్రి అచ్చెన్నాయుడు

ABN , Publish Date - May 25 , 2026 | 08:14 PM

విశాఖ ఉక్కును నిర్వీర్యం చేయాలని గత వైసీపీ ప్రభుత్వం చూసిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు విమర్శించారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేసి.. ఆ విలువైన భూములను ఆక్రమించుకోవాలని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌ కుట్ర పన్నారని పేర్కొన్నారు.

విశాఖ ఉక్కు భూములు ఆక్రమించాలని జగన్ కుట్ర: మంత్రి అచ్చెన్నాయుడు
AP Minister Atchannaidu

శ్రీకాకుళం, మే 25: విశాఖ ఉక్కును నిర్వీర్యం చేయాలని గత వైసీపీ ప్రభుత్వం చూసిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు విమర్శించారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేసి.. ఆ విలువైన భూములను ఆక్రమించుకోవాలని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌ కుట్ర పన్నారని పేర్కొన్నారు. అధికార దాహంతో ఉక్కు భూములను ఆక్రమించాలని వైఎస్ జగన్ చూశారని మండిపడ్డారు. తన స్వార్ధం కోసం వైఎస్ జగన్ ఎవరినైనా బలి చేస్తారన్నారు. సోమవారం శ్రీకాకుళంలో మంత్రి కె. అచ్చెన్నాయుడు విలేకర్లతో మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నడుం బిగించారని తెలిపారు. ఈ ఉక్కు పరిశ్రమ కోసం కేంద్రాన్ని ఒప్పించి రూ.15 వేల కోట్ల నిధులను సీఎం చంద్రబాబు మంజూరు చేయించారని గుర్తు చేశారు.


సీఎం చంద్రబాబు ఓ బ్రాండ్ అని అభివర్ణించారు. సీఎం చంద్రబాబు విజన్‌కు ఆకర్షితులైన పారిశ్రామిక దిగ్గజాలు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయన్నారు. గూగుల్, రిలయన్స్, మిట్టల్ వంటి దిగ్గజ సంస్థలు రాష్ట్రం వైపు చూస్తున్నాయని చెప్పారు. గత వైసీపీ పాలనలో కమీషన్ల కోసం పారిశ్రామికవేత్తలను వేధించడమే కాకుండా.. భయబ్రాంతులకు గురి చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వైసీపీని శాశ్వతంగా పాతాళానికి పంపుతామని స్పష్టం చేశారు.


వైసీపీ హయాంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన వారు.. రాష్ట్రానికి దండం పెట్టి వెనుదిరిగారన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నీకెంత - నాకెంత అన్నట్లుగా పాలన సాగేదని వివరించారు. ప్రజాస్వామ్యంలో గొడ్డలి పార్టీకి స్థానం లేదని కుండబద్దలు కొట్టారు. అధికారం కోసం సొంత బాబాయినే అడ్డంగా నరికేశారని వైఎస్ జగన్‌పై మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

చిరంజీవి నివాసానికి టాలీవుడ్ ప్రముఖులు.. పర్సంటేజ్‌పై చర్చ..

మహానాడుకు వైసీపీ మీటింగ్ దిష్టి చుక్క లాంటిది: మంత్రి రాంప్రసాద్

Read Latest AP News And Telugu News

Updated Date - May 25 , 2026 | 08:18 PM