Share News

విదేశీయుల వసతిపై హోటళ్లు, విద్యాసంస్థలకు సీపీ ఆదేశాలు

ABN , Publish Date - Oct 07 , 2026 | 09:36 PM

విదేశీయులకు వసతి కల్పించే హోటళ్లు, విద్యాసంస్థలు అప్రమత్తంగా వ్యవహరించాలని విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఆదేశించారు. విదేశీయులు తమ వద్ద బస చేసినప్పుడు వారి పూర్తి వివరాలను నిబంధనల ప్రకారం పోలీసులకు తెలియజేయాలని సూచించారు.

విదేశీయుల వసతిపై హోటళ్లు, విద్యాసంస్థలకు సీపీ ఆదేశాలు
Vijayawada CP Rajasekhar Babu

అమరావతి: విదేశీయులకు వసతి కల్పించే హోటళ్లు, విద్యాసంస్థలు అప్రమత్తంగా వ్యవహరించాలని విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఆదేశించారు. విదేశీయులు తమ వద్ద బస చేసినప్పుడు వారి పూర్తి వివరాలను నిబంధనల ప్రకారం పోలీసులకు తెలియజేయాలని సూచించారు. విజయవాడ పరిధిలో విదేశీయులకు ఆశ్రయం కల్పించే హోటళ్లు, విద్యాసంస్థలు, ఇతర వసతి నిర్వాహకులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సీపీ స్పష్టం చేశారు.


తమ వద్ద వసతి పొందిన విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా సంబంధిత అధికారులకు తెలియజేయాలని రాజశేఖర్ బాబు తెలిపారు. అలాగే, indiannfrro.gov.in వెబ్‌సైట్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. విదేశీయుల వసతి, వివరాల నమోదుకు సంబంధించిన నిబంధనలను ప్రతి సంస్థ కచ్చితంగా పాటించాలని సీపీ పేర్కొన్నారు. నిబంధనలను ఉల్లంఘించినట్లయితే రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు జరిమానా విధిస్తామని తెలిపారు.

అలాగే, 2 నుంచి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉందని సీపీ హెచ్చరించారు. విదేశీయుల వివరాల నమోదు విషయంలో నిర్లక్ష్యం వహించకుండా, నిబంధనలను పూర్తిగా పాటించాలని హోటళ్లు, విద్యాసంస్థలు, ఇతర వసతి నిర్వాహకులకు సీపీ రాజశేఖర్ బాబు సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి

హరితాంధ్రప్రదేశ్‌ నిర్మాణానికి రైతుల భాగస్వామ్యం కీలకం: నాగబాబు

ఏపీలో ఓటర్ల జాబితాపై ప్రత్యేక డ్రైవ్.. తొలగించిన ఓట్లపై రీ - వెరిఫికేషన్ చేస్తాం: ఏపీ సీఈవో

Updated Date - Oct 07 , 2026 | 09:36 PM