ప్రముఖ యువ గాయని శ్రీలలితకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అభినందనలు
ABN , Publish Date - Jun 16 , 2026 | 04:36 PM
విజయవాడలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా ప్రముఖ యువ గాయని శ్రీలలిత నివాసానికి కేంద్ర మంత్రి విచ్చేశారు.
విజయవాడ, జూన్ 16: విజయవాడలో వివిధ కార్యక్రమాలలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ యువ గాయని శ్రీలలిత నివాసానికి కేంద్ర మంత్రి విచ్చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని 12 ఏళ్ల సుపరిపాలన, సాధించిన విజయాలపై రూపొందించిన ప్రత్యేక పుస్తకాన్ని శ్రీలలితకు అందజేశారు. కర్ణాటక, హిందుస్తానీ సంగీత శైలులు రెండింటిలోనూ రాణిస్తున్న శ్రీలలితను ప్రహ్లాద్ జోషి అభినందించారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. రెండు విభిన్న సంగీత ప్రక్రియలను నేర్చుకోవడం ఎంతో కష్టతరమన్నారు.
గతంలో ప్రధాని మోదీ స్వయంగా శ్రీలలిత ప్రతిభను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రశంసించారని తెలిపారు. కర్ణాటకలో ధార్వాడ్.. హిందుస్తానీ సంగీతానికి ఎందరో మహానుభావులను అందించిందన్నారు. దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ సాధించిన అద్భుత ప్రగతిని, ప్రపంచ సంక్షోభాల సమయంలోనూ దేశాన్ని సమర్థవంతంగా నడిపించిన తీరు గురించి అందరూ తెలుసుకోవాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఇక్కడి రాజధానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు.
దుర్గమ్మకు ప్రహ్లాద్ జోషి ప్రత్యేక పూజలు
ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రత్యేక పూజలు చేశారు. ఈరోజు(మంగళవారం) ఇంద్రకీలాద్రి చేరుకున్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్‌కు ఆలయ మర్యాదలతో ఆలయ అర్చకులు, దుర్గగుడి పాలకమండలి ఛైర్మన్ రాధాకృష్ణ, ఈవో శీనానాయక్ స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని, వేద పండితుల చేత వేద ఆశీర్వచనం పొందారు. అనంతరం కేంద్ర మంత్రికి అమ్మవారి లడ్డూ ప్రసాదాన్ని, చిత్రపటాన్ని ఆలయ అధికారులు అందజేశారు.
ఇవి కూడా చదవండి...
తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: కేంద్ర మంత్రి బండి సంజయ్
టీజీ బిల్డర్స్ అసోసియేషన్‌తో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భేటీ
Read Latest AP News And Telugu News