అలర్ట్.. రానున్న మూడు గంటల్లో పిడుగులతో వర్షాలు..
ABN , Publish Date - May 03 , 2026 | 08:06 PM
ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ అలర్ట్ జారీ చేశారు. రానున్న మూడు గంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ అలర్ట్ జారీ చేశారు. రానున్న మూడు గంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు.
అలాగే ఎన్టీఆర్, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోనూ అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురవనున్నట్లు వెల్లడించారు. ఆయా జిల్లాల్లో గంటలకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. పిడుగులతో వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై ప్రశంసలు కురిపించిన పీవీ సింధు
పాలకొల్లులో మంత్రి నిమ్మల సుడిగాలి పర్యటన.. అభివృద్ధి పనులకు శంకుస్థాపన