Share News

డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై ప్రశంసలు కురిపించిన పీవీ సింధు

ABN , Publish Date - May 03 , 2026 | 04:17 PM

ఆంధ్రప్రదేశ్‌లో మ్యాజిక్ డ్రెయిన్ల విషయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ప్రశంసల వర్షం కురిపించారు. గ్రామాల్లో పరిశుభ్ర వాతావరణం నెలకొల్పేందుకు డిప్యూటీ సీఎం వినూత్న కార్యక్రమం చేపట్టారని కొనియాడారు.

డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై ప్రశంసలు కురిపించిన పీవీ సింధు
PV Sindhu

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మ్యాజిక్ డ్రెయిన్ల విషయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ప్రశంసల వర్షం కురిపించారు. గ్రామాల్లో పరిశుభ్ర వాతావరణం నెలకొల్పేందుకు డిప్యూటీ సీఎం వినూత్న కార్యక్రమం చేపట్టారని కొనియాడారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆమె ఓ వీడియో రిలీజ్ చేశారు.


ఈ సందర్భంగా పీవీ సింధు మాట్లాడుతూ.. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో అనేక గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మురుగు కాలువల సమస్య పరిష్కారానికి మ్యాజిక్ డ్రెయిన్లు అనే వినూత్న కార్యక్రమానికి పవన్ శ్రీకారం చుట్టారని ప్రశంసించారు. ఈ మ్యాజిక్ డ్రైనేజీ వ్యవస్థ కారణంగా నీరు వడపోతకు గురై భూగర్భ జలాలు మెరుగుపడతాయని సింధు చెప్పుకొచ్చారు. అలాగే మురుగు నీరు రోడ్ల పైకి రాకుండా ఉంటుందని, దుర్వాసన లేకుండా కాలువలోనే నీరు ఇంకిపోతుందని ఆమె తెలిపారు.


ఇలాంటి మ్యాజిక్ డ్రెయిన్స్ కార్యక్రమం అమలు చేస్తున్న పవన్ కల్యాణ్‌కు పీవీ సింధు హ్యాట్సాఫ్ చెప్పారు. మరిన్ని వినూత్న కార్యక్రమాలను ఏపీలో చేపట్టాలని కోరుతూ ఆమె వీడియో రిలీజ్ చేశారు. అయితే, పీవీ సింధు వీడియోపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కార్యాలయం స్పందించింది. మ్యాజిక్ డ్రైనేజీ వ్యవస్థపై విలువైన అభిప్రాయాన్ని తెలియజేసినందుకు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు ధన్యవాదాలు తెలిపింది.


ఈ వార్తలు కూడా చదవండి

ప్రకాశ్‌రాజ్‌ పొలిటికల్ జోకర్.. కిరణ్ రాయల్ షాకింగ్ కామెంట్స్

వైసీపీని 'గొడ్డలి పార్టీ' అనకుంటే మరేమంటారు?: ఎమ్మెల్యే అహ్మద్

Updated Date - May 03 , 2026 | 04:30 PM