పాలకొల్లులో మంత్రి నిమ్మల సుడిగాలి పర్యటన.. అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ABN , Publish Date - May 03 , 2026 | 07:18 PM
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు సుడిగాలి పర్యటన చేశారు. వివరాల్లోకి వెళితే..
పాలకొల్లు, మే 03: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు సుడిగాలి పర్యటన చేశారు. ఈ పర్యటనలో భాగంగా పట్టణంలోని 1 నుంచి 15 వార్డుల పరిధిలో సుమారు రూ.3.8 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్థానికులను ఉద్దేశించి మాట్లాడారు.
ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ..‘కూటమి ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళు. పేదరికం లేని సమాజ నిర్మాణమే ప్రభుత్వ ధ్యేయం. అర్హులైన పేదలందరికీ గృహాలు అందించాలనే సంకల్పంతో పని చేస్తున్నాం. వచ్చే జులై నాటికి మిగిలిన లబ్ధిదారులందరికీ టిడ్కో ఇళ్లను అందజేస్తాం. నియోజకవర్గంలో ఇప్పటి వరకు ముఖ్యమంత్రి ఆరోగ్య సహాయ నిధి ద్వారా 13 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు అందించాం’ అని అన్నారు. ఈ పర్యటనలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
రుణమాఫీ చారాణ చేసి.. బారాణ ఎగ్గొట్టింది.. కాంగ్రెస్ సర్కార్‌పై హరీశ్‌రావు సెటైర్లు
తండ్రిని విమర్శించడం కవితకు తగదు: దానం నాగేందర్