Share News

తానా ఫౌండేషన్ ‘మహిళా సాధికారత’ భారీగా కుట్టు మిషన్లు పంపిణీ

ABN , Publish Date - Mar 13 , 2026 | 06:28 PM

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)కి అనుబంధ సంస్థ తానా ఫౌండేషన్(TANA Foundation). ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళా సాధికారతను ప్రోత్సహించే లక్ష్యంతో“Stitching Hope – Sewing Machines to Empower the Needy” పలు కార్యక్రమాలు చేపట్టింది.

తానా ఫౌండేషన్ ‘మహిళా సాధికారత’ భారీగా కుట్టు మిషన్లు పంపిణీ

విజయవాడ, మార్చి 13: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)కి అనుబంధ సంస్థ తానా ఫౌండేషన్(TANA Foundation). ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళా సాధికారతను ప్రోత్సహించే లక్ష్యంతో“Stitching Hope – Sewing Machines to Empower the Needy” పలు కార్యక్రమాలు చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని విజయవాడ వేదికగా తానా ఫౌండేషన్ ఘనంగా నిర్వహించింది.

మహిళలకు100 కుట్టు మిషన్ యంత్రాలను పంపిణీ చేసింది. ఈ సేవా కార్యక్రమానికి తానా కోశాధికారి రాజా కసుకుర్తి ప్రాయోజకత్వం వహించగా.. తానా అధ్యక్షుడు డా. నరెన్ కోడాలి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ లావు, తానా ఫౌండేషన్ చైర్మన్ డా. ప్రసాద్ నల్లూరి శుభాకాంక్షలు తెలిపారు.


NRI-TANA-1.jpg

విజయవాడలో గురునానక్ కాలనీలోని ఎన్.ఏ.సి కళ్యాణ వేదిక (N.A.C Kalyana Vedika)గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయవాడ లోక్‌సభ సభ్యులు కేశినేని చిన్ని, విజయవాడ నగర తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, టిడిపి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు, కృష్ణాజిల్లా జెడ్పీ మాజీ చైర్మన్ గద్దె అనురాధ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.


NRI-TANA-3.jpg

అలాగే నగరంలోని పలువురు కార్పొరేటర్లు, స్థానిక నాయకులు, సామాజిక కార్యకర్తలతోపాటు మహిళలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సమాజ సేవలో తానా ఫౌండేషన్ చేస్తున్న కార్యక్రమాలపై ముఖ్య అతిథులు ప్రశంసల వర్షం కురిపించారు. మరి ముఖ్యంగా మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించే ఈ కార్యక్రమం.. ఎంతో ప్రేరణ కలిగిస్తుందని అభినందించారు.


NRI-TANA-4.jpg

ఈ సందర్భంగా తానా కోశాధికారి రాజా కసుకుర్తి మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం వెనుకనున్న లక్ష్యాన్ని వివరించారు. ‘Stitching Hope – Sewing Machines to Empower the Needy’ అనే ఈ కార్యక్రమం ద్వారా అవసరమైన వారికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి తానా ఫౌండేషన్ చిన్న ప్రయత్నం చేస్తోందని వివరించారు. తానా ఫౌండేషన్ నిత్యం “సేవే లక్ష్యం” అనే భావనతో పనిచేస్తోందన్నారు.


NRI-TANA-5.jpg

అమెరికాలోని తెలుగు వారిని ఒకటిగా చేర్చి.. సమాజానికి తిరిగి ఇవ్వడం ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. విద్య, ఆరోగ్యం, రైతుల సంక్షేమం, మహిళా సాధికారత వంటి వివిధ రంగాల్లో తానా ఫౌండేషన్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని గుర్తు చేశారు. ఈ రోజు పంపిణీ చేస్తున్న కుట్టు యంత్రాలు కేవలం యంత్రాలు మాత్రమే కాదని.. ఇవి ఆత్మవిశ్వాసానికి, ఆర్థిక స్వావలంబనతోపాటు ఒక కుటుంబానికి కొత్త ఆశకు ప్రతీకలని అభివర్ణించారు.


NRI-TANA-6.jpg

ఈ యంత్రాలు అందుకునే మహిళలు ప్రతిభతోపాటు కృషితో తమ కుటుంబాల జీవనోపాధిని మెరుగు పరుచుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఒక చిన్న అవకాశం సైతం చాలా పెద్ద మార్పును తీసుకువస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన తానా ఫౌండేషన్ నాయకత్వానికి, స్థానిక నిర్వాహకులతోపాటు వాలంటీర్లకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో భాగం కావడం తనకు గర్వకారణమన్నారు.


NRI-TANA-7.jpg

తానా ఫౌండేషన్‌పై ముఖ్య అతిథుల ప్రశంసల వర్షం

ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ దంపతులు ఈ సందర్భంగా తానా ఫౌండేషన్ సేవలను ప్రశంసించారు. మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. విదేశాల్లో ఉన్నప్పటికీ భారతదేశంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తానా ఫౌండేషన్ సేవా స్ఫూర్తి అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఈ కుట్టు యంత్రాల ద్వారా తమ కుటుంబాల జీవనోపాధిని మెరుగుపరుచుకుంటామని వారు ఆనందం వ్యక్తం చేశారు.

Updated Date - Mar 13 , 2026 | 08:07 PM