Share News

మా పోరాటం ఫలించింది.. ABNతో గాదె సాయికృష్ణ కుటుంబ సభ్యులు

ABN , Publish Date - Jun 24 , 2026 | 05:12 PM

గాదె సాయికృష్ణ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఐ నాగరాజును జైలుకు తరలించిన నేపథ్యంలో బాధిత కుటుంబ సభ్యులు స్పందించారు. ABNతో మాట్లాడుతూ.. తమ పోరాటానికి ఫలితం దక్కిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని వారు పేర్కొన్నారు.

మా పోరాటం ఫలించింది.. ABNతో గాదె సాయికృష్ణ కుటుంబ సభ్యులు
Gade Sai Krishna Family

విజయవాడ: ఏపీలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజును నేడు జైలుకు తరలించడంతో బాధిత కుటుంబ సభ్యులు స్పందించారు. ABNతో మాట్లాడుతూ.. తమ పోరాటానికి ఫలితం దక్కిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని వారు పేర్కొన్నారు.


కేసులో ఇంకా పలువురి పాత్ర ఉన్నట్లు తమకు అనుమానాలు ఉన్నాయని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పాత్రధారులు, సూత్రధారులు ఎవరైనా ఉన్నట్లయితే వారిపై కూడా సమగ్ర దర్యాప్తు జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. తమ కుమారుడిని ఒక్కసారి చూపించాలని వేడుకున్నప్పటికీ పోలీసులు స్పందించలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. అన్యాయంగా తమ బిడ్డను కోల్పోయామని, చివరిసారిగా చూసుకునే అవకాశం కూడా దక్కలేదని కన్నీటి పర్యంతమయ్యారు.


ఇలాంటి పరిస్థితి మరే కుటుంబానికీ రాకూడదనే ఉద్దేశంతోనే తాము న్యాయం కోసం పోరాటం కొనసాగించామని చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తమ బాధను అర్థం చేసుకుందని తెలిపారు. కేసులో భాగమైన ప్రతి ఒక్కరినీ గుర్తించి చట్టం ముందు నిలబెట్టాలని డిమాండ్ చేశారు. పూర్తి స్థాయి దర్యాప్తు ద్వారా వాస్తవాలు వెలుగులోకి రావాలని, బాధ్యులందరికీ తగిన శిక్ష పడాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.


Also read:

ఉరుములు, మెరుపులతో వర్షాలు.. ఏపీ వాతావరణ శాఖ అలర్ట్

'నేషనల్ రేర్ డిసీజెస్ పాలసీ' అమలుకు పటిష్ఠ చర్యలు: మంత్రి సత్యకుమార్ యాదవ్

Updated Date - Jun 24 , 2026 | 06:22 PM