Share News

ప్రతి బీజేపీ కార్యాలయంలో ఉగాది వేడుకలు.. పీవీఎన్ మాధవ్ ఆదేశం

ABN , Publish Date - Mar 18 , 2026 | 04:01 PM

ఉగాది పర్వదినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని బీజేపీ కార్యాలయాల్లో వేడుకలు నిర్వహించాలని నేతలకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పిలుపునిచ్చారు. పంచాంగ శ్రవణాన్ని తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు.

ప్రతి బీజేపీ కార్యాలయంలో ఉగాది వేడుకలు.. పీవీఎన్ మాధవ్ ఆదేశం
PVN Madhav

అమరావతి, మార్చి 18: ఉగాది పర్వదినం సందర్భంగా పార్టీ శ్రేణులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్(PVN Madhav) దిశానిర్దేశం చేశారు. టెలికాన్ఫరెన్స్ ద్వారా నేతలు, కార్యకర్తలతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని బీజేపీ కార్యాలయాల్లో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ప్రతి కార్యాలయంలో పురోహితులను పిలిపించి పూజా కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. పంచాంగ శ్రవణం తప్పనిసరిగా జరగాలని ఆయన ఆదేశించారు.


ప్రతి జిల్లాలోని ముఖ్యమైన గ్రామ దేవతలను పార్టీ నాయకులు సందర్శించాలని మాధవ్ సూచించారు. గ్రామ దేవతలకు పార్టీ తరఫున సంప్రదాయబద్ధంగా సారె సమర్పించే కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. డప్పు వాయిద్యాలతో ఊరేగింపు నిర్వహించి స్థానిక ప్రజలతో కలిసి ఈ వేడుకలు జరపాలని ఆదేశించారు. కొత్త అమావాస్య, ఉగాది సందర్భంగా నిర్వహించే ఈ కార్యక్రమాలను పార్టీ శ్రేణులు.. ప్రజలతో మమేకమై చేయాలని పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

మాజీ మంత్రి కఠారి ఈశ్వర్ ఇంట్లో చోరీ... పోలీసుల దర్యాప్తు

‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 18 , 2026 | 04:48 PM