‘నిన్ను, నీ కుటుంబాన్ని చంపేస్తా’.. ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌కు బెదిరింపు కాల్స్
ABN , Publish Date - Jun 08 , 2026 | 03:40 PM
కృష్ణా జిల్లా పెనమలూరు శాసనసభ్యులు బోడె ప్రసాద్‌కు బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేపుతోంది. తనను, తన కుటుంబాన్ని చంపేస్తానంటూ ఓ వ్యక్తి ఫోన్ చేసి బెదిరించారంటూ పోలీసులకు ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు.
కృష్ణా జిల్లా, జూన్ 8: పెనమలూరు శాసనసభ్యులు బోడె ప్రసాద్‌కు బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేపుతోంది. ‘+447773212073 నంబర్ నుంచి నా పేరు మాలపాటి భాస్కర్ రెడ్డి అని చెప్పి గతంలో నన్ను జైలుకు పంపించావు కదా.. నిన్ను, నీ కుటుంబాన్ని చంపేస్తాను.. నువ్వు ప్రాణాలతో బయట ఎలా తిరుగుతావో చూస్తాను’ అంటూ అసభ్య పదజాలంతో దూషిస్తూ ఫోన్ చేసి బెదిరించినట్టు పోలీసులకు ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్, సీజేఐ వెంకటరమణ సహా పలువురు టీడీపీ వారిపై అసభ్యకర పోస్టులు పెట్టినందుకు మాలపాటి భాస్కర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
అనంతరం భాస్కర్ రెడ్డి మాలపాటి అనే ఫేస్‌బుక్ అకౌంట్ నుంచి తనపై అసభ్యకరమైన పోస్టులు పెట్టినట్టు పోలీసులకు ఎమ్మెల్యే చెప్పారు. తాజాగా తనకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారంటూ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే స్వయంగా పెనమలూరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి.. ఫోన్ చేసి బెదిరిస్తున్న సదరు వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
జగన్ పిచ్చితనానికి ట్రీట్‌మెంట్ ఎక్కడో తెలియడం లేదు: సీఎం చంద్రబాబు
ఏపీలో వికాస పాలన.. అన్ని హామీలను నెరవేరుస్తున్నాం: మంత్రి బీసీ జానార్దన్ రెడ్డి
Read Latest AP News And Telugu News