అమలాపురంలో విద్యుత్ షాక్‌తో జనసైనికుడి మృతిపై పవన్ కల్యాణ్ విచారం
ABN , Publish Date - Sep 02 , 2026 | 02:58 PM
అమలాపురంలో విద్యుత్ షాక్‌తో జన సైనికుడి మృతిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రేమ్ కుమార్ మృతి కలిచివేసిందన్నారు.
అమరావతి, సెప్టెంబర్ 2: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఫ్లెక్సీలు కడుతూ విద్యుత్ షాక్‌కు గురై ప్రేమ్‌కుమార్ మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఉపముఖ్యమంత్రి స్పందిస్తూ.. యువకుడి మృతిపై ఆవేదన వ్యక్తం చేశారు. అమలాపురంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై జనసైనికుడు ప్రాణాలు కోల్పోవడం కలచివేసిందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. యువకుడి కుటుంబానికి అండగా నిలబడతామని హామీ ఇచ్చారు.
జీవితం ఎంతో అమూల్యమైనదని పవన్ అన్నారు. ఉత్సవాల సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే సమయంలో మన కోసం కుటుంబం ఉందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించారు. ఎత్తైన ప్రదేశాల్లో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసే సమయంలో, ర్యాలీల్లో స్వీయ భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అందరూ అప్రమత్తంగా వ్యవహరించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచనలు చేశారు.
ఇవి కూడా చదవండి...
జనసేన యువజన విభాగం ‘జై కొట్టు’.. పిఠాపురంలో లోగో ఆవిష్కరణ
అన్నమయ్య ప్రాజెక్ట్ విపత్తు క్రెడిట్ జగన్‌కే దక్కుతుంది: పట్టాభి
Read Latest AP News And Telugu News