Share News

పరవాడ కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదంపై పవన్ కల్యాణ్ ఆరా

ABN , Publish Date - Jun 23 , 2026 | 10:03 AM

అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలోని కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ నుంచి వివరాలు తెలుసుకున్నారు.

పరవాడ కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదంపై పవన్ కల్యాణ్ ఆరా
Deputy CM Pawan Kalyan

అమరావతి, జూన్ 23: అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలోని 'దక్షిణ ఎనర్జీ కెమికల్ ఫ్యాక్టరీ'లో జరిగిన అగ్ని ప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రమాదంపై ఆరా తీసిన ఉపముఖ్యమంత్రి... ఇద్దరు కార్మికులు మరణించడం పట్ల విచారం వ్యక్తం చేశారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని పవన్‌కు అధికారులు తెలియజేశారు.


పరిశ్రమల్లో ప్రమాదాలను నివారించడానికి తీసుకుంటున్న చర్యలను సమీక్షించాలని డిప్యూటీ సీఎం సూచించారు. విశాఖపట్నం పరిసర పారిశ్రామిక ప్రాంతాల్లోని అన్ని సంస్థల్లో తక్షణమే భద్రతా తనిఖీలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. అగ్నిప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని పవన్ కల్యాణ్ ప్రకటించారు.


ఇవి కూడా చదవండి...

విశాఖ అగ్నిప్రమాదం.. ఇద్దరు కార్మికుల మృతిపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం

అపార్ట్‌మెంట్‌లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం.. ఇద్దరి అరెస్ట్

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 23 , 2026 | 10:19 AM