పార్వతీపురం కౌంటింగ్ ఆలస్యంపై ఈసీ సీరియస్
ABN , Publish Date - Nov 03 , 2026 | 10:43 AM
పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఓట్ల లెక్కింపులో ఆలస్యంపై ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ఇందుకు కారణమైన ఇద్దరు అధికారులను సస్పెండ్ చేస్తూ ఎలక్షన్ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
పార్వతీపురం మన్యం జిల్లా, నవంబర్ 3: పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఓట్ల లెక్కింపులో ఆలస్యంపై ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ఇందుకు కారణమైన ఇద్దరు అధికారులను సస్పెండ్ చేస్తూ ఎలక్షన్ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. స్ట్రాంగ్ రూమ్‌కు సంబంధించి తాళాలు కనిపించకపోవడం కారణంగా గంటన్నరపైగా లెక్కింపు ప్రక్రియ ఆలస్యమైంది. దీనికి సంబంధించి ఇన్‌ఛార్జ్‌లుగా ఉన్న మేనేజర్ ఈశ్వరరావు, టీపీఎస్ సత్యనారాయణ అనే ఇద్దరు ఆఫీసర్లను ఎన్నికల అధికారులు సస్పెండ్ చేశారు.
ఈరోజు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభంకావాల్సి ఉండగా.. స్ట్రాంగ్ రూం తాళం పోవడంతో దాదాపు రెండు గంటల పాటు దాని కోసం అధికారులు వెతికారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకుంది. ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసింది. తాళం చెవి దొరకపోవడంతో అభ్యర్థుల సమక్షంలో తాళం పగలగొట్టి అక్కడే కౌంటింగ్‌ను ప్రారంభించారు.
ఇవి కూడా చదవండి..
మురసు తుఫాన్ నష్టంపై అమిత్ షా ఫోన్.. కేంద్ర సాయం కోరిన సీఎం చంద్రబాబు
ఏపీలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు.. 7 జిల్లాలకు అత్యంత భారీ వర్ష సూచన
Read Latest AP News And Telugu News