రోడ్డు ప్రమాదంలో నవోదయ ప్రిన్సిపాల్ మృతి
ABN , Publish Date - Mar 29 , 2026 | 08:13 PM
రోడ్డు ప్రమాదంలో నవోదయ పాఠశాల ప్రిన్సిపాల్ మరణించారు. కృష్ణాజిల్లా బాపులపాడు మండలం వేలేరు గ్రామంలోని నవోదయ స్కూల్ ప్రిన్సిపాల్ యదునందన్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
మచిలీపట్నం, మార్చి 29: రోడ్డు ప్రమాదంలో నవోదయ పాఠశాల ప్రిన్సిపాల్ మరణించారు. కృష్ణాజిల్లా బాపులపాడు మండలం వేలేరు గ్రామంలోని నవోదయ స్కూల్ ప్రిన్సిపాల్ యదునందన్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆదివారం వేలేరు గ్రామ సమీపంలో నవోదయ ప్రిన్సిపాల్ యదునందన్ కారును టిప్పర్ లారీ ఢీకొంది. ఈ సంఘటనలో ప్రిన్సిపాల్ యదునందన్ అక్కడికక్కడే మృతి చెందారు.
అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని యదునందన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం బందరు జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. టిప్పర్ డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీసీటీవీ కెమెరా వైర్ అనుకుని కేబుల్ వైర్ కట్ చేసింది.. అంతే..
తల్లిదండ్రుల సంరక్షణ చట్టం బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం
For More AP News And Telugu News