Share News

‘బాగున్నారా’ అంటూ కరచాలనం.. మోపిదేవిలో ప్రజలను ఆప్యాయంగా పలకించిన లోకేశ్

ABN , Publish Date - Jun 24 , 2026 | 12:19 PM

కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో మంత్రి నారా లోకేశ్ పర్యటన కొనసాగుతోంది. కొక్కిలిగడ్డ నుంచి మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్న మంత్రి.. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు.

‘బాగున్నారా’ అంటూ కరచాలనం.. మోపిదేవిలో ప్రజలను ఆప్యాయంగా పలకించిన లోకేశ్
Minister Nara Lokesh

కృష్ణాజిల్లా, జూన్ 24: అవనిగడ్డ నియోజకవర్గంలో మంత్రి నారా లోకేశ్ పర్యటన కొనసాగుతోంది. కొక్కిలిగడ్డ నుంచి మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్న మంత్రి.. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి చేరుకునే ముందు గ్రామస్తులను ఆప్యాయంగా పలకరించారు లోకేశ్. 'బాగున్నారా' అంటూ కరచాలనం చేశారు. ఒక్కసారిగా తమ వద్దకు మంత్రి రావడంతో ప్రజలు, భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. 'లోకేశ్ అన్నా' అంటూ ప్రేమతో మంత్రిని స్థానిక ప్రజానీకం పలకరించింది.


అనంతరం, వేద ఆశీర్వచనాలతో లోకేశ్‌కు దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి.. స్వామివారి పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామివారి ఫొటో, లడ్డూ ప్రసాదాన్ని అందించి లోకేశ్‌ను అధికారులు సత్కరించారు. లోకేశ్ వెంట స్వామివారిని ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్, బోడే ప్రసాద్, వెనిగండ్ల రాము, కాగిత దర్శించుకున్నారు. అనంతరం మోపిదేవిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరంలో టీడీపీ కార్యకర్తలు, నేతల సమన్వయ సమావేశంలో మంత్రి లోకేశ్ పాల్గొననున్నారు.


ఇవి కూడా చదవండి...

కృష్ణా జిల్లాలో మంత్రి లోకేశ్ పర్యటన.. నేతల ఘనస్వాగతం

ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ధ్యేయం: వసంత కృష్ణప్రసాద్

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 24 , 2026 | 12:23 PM