Share News

వైసీపీలో సజ్జల ఎవరు.. లోకేశ్ ప్రశ్న

ABN , Publish Date - Mar 28 , 2026 | 11:19 AM

రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లు ఈరోజు రాత్రికి ఢిల్లీకి వెళ్తుందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఏప్రిల్ 2న పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెడతారని.. అక్కడ వైసీపీ వాళ్లు ఏం చేస్తారో చూడాలని మంత్రి అన్నారు.

వైసీపీలో సజ్జల ఎవరు.. లోకేశ్ ప్రశ్న
Minister Nara Lokesh

అమరావతి, మార్చి 28: వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మంత్రి మాట్లాడుతూ.. సజ్జల జ్ఞానం ఎంతవరకు ఉందో అందరికీ తెలుసని.. వైసీపీలో సజ్జల ఎవరు అని ప్రశ్నించారు. అమరావతిని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా చట్టబద్ధత కల్పించాలని ఈరోజు ఏపీ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఈరోజు రాత్రికి అసెంబ్లీ తీర్మానం ఢిల్లీకి వెళ్తుందన్నారు. ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాల్లోనే ఈ బిల్లు పెడతారని భావిస్తున్నట్లు చెప్పారు.


ఏప్రిల్ 1వ తేదీన కేంద్ర కేబినెట్‌లో ఈ బిల్లును ఆమోదించే అవకాశం ఉందని.. ఏప్రిల్ 2వ తేదీన పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి తెలిపారు. పార్లమెంట్‌లో వైసీపీ వాళ్లు ఏం చేస్తారో చూడాలన్నారు మంత్రి. అసెంబ్లీలోనే బిల్లు(తీర్మానం)కు వాళ్లు రావాల్సి ఉందని.. వాళ్లు రాకపోవడం అనేది అమరావతిపై వైసీపీకి ఎంత శ్రద్ధ ఉందో తెలుస్తుందన్నారు.


‘అసెంబ్లీ జరుగుతుంటే సెక్యూరిటీ ఎంత ఉందో మీరే చూడండి. బ్లూ బుక్ ప్రకారం అందరూ ప్రోటోకాల్ ఇవ్వాల్సిందే. పాదయాత్రలో చంద్రబాబుకు సినిమా చూపిస్తామని జగన్ అన్నారు. ఆయన సినిమా ఏమిటో అందరికీ తెలుసు. ఆ సినిమా ఎలా ఆడిందో ప్రజలందరికీ తెలుసు. వైసీపీలో 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నా వాళ్లు అసెంబ్లీకి రావడం లేదు. మేము మాత్రం 11 గంటలకు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడుతున్నాము. 11 గంటలకు ముహూర్తం చూసి మరి పెట్టాము’ అని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

రెచ్చిపోయిన వైసీపీ నేతలు.. టీడీపీ దిమ్మెల ధ్వంసం

సరిగ్గా 11:11 నిమిషాలకు అమరావతి చట్టబద్ధత బిల్లును ప్రవేశపెట్టిన చంద్రబాబు

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 28 , 2026 | 12:23 PM