Share News

మంతెనకు యోగా, నేచరోపతి విభాగ సలహాదారుగా బాధ్యతలు

ABN , Publish Date - Mar 09 , 2026 | 03:13 PM

యోగా, నేచరోపతి విభాగానికి సలహాదారుగా మంతెన సత్యనారాయణ రాజుకు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేబినెట్ హోదాతో పాటు హానరరీ అడ్వైజర్‌గా బాధ్యతలు అప్పగించింది.

మంతెనకు యోగా, నేచరోపతి విభాగ సలహాదారుగా బాధ్యతలు
AP Govt

అమరావతి, మార్చి 9: ప్రభుత్వ సలహాదారుగా మంతెన సత్యనారాయణ రాజును నియమిస్తూ ప్రభుత్వం ఈరోజు(సోమవారం) అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. మంతెనకు యోగా & నేచరోపతి విభాగానికి సలహాదారుగా బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కేబినెట్ హోదాతో పాటు హానరరీ అడ్వైజర్‌గా బాధ్యతలు అప్పగించింది. రెండు సంవత్సరాల పదవీకాలం వరకు ఆయన సేవలు కొనసాగనున్నాయి. వాహనం, కార్యాలయం, సిబ్బంది సౌకర్యాలతో పాటు అధికారిక పర్యటనలకు ట్రావెల్ అలవెన్స్ కూడా కల్పించాలని ఉత్తర్వుల్లో స్పష్టమైన ఆదేశాలు ఇవ్వబడ్డాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎస్ జి. సాయి ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు.


మరోవైపు.. ఏపీ రాష్ట్ర పోలీస్ నోడల్ ఆఫీసర్‌గా ఎన్‌. మధుసూదన రెడ్డి నియామకం జరిగింది. అడిషనల్ డీజీపీగా(లా అండ్ ఆర్డర్) ఉన్న మధుసూదన రెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఎన్నికల కమిషన్ ఆమోదంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ నుంచి జీఓ ఆర్.టి. నెం.519 జారీ అయింది. ఎన్నికల సమన్వయం కోసం స్టేట్ పోలీస్ నోడల్ ఆఫీసర్‌గా ఎన్. మధుసూదన రెడ్డి పని చేయనున్నారు. అవసరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీకి ప్రభుత్వం సూచించింది.


ఇవి కూడా చదవండి..

ఈడీ విచారణకు కృష్ణమోహన్ రెడ్డి.. ఏబీఎన్‌ను చూడగానే పరుగో పరుగు

లడ్డూ కల్తీపై తప్పుడు ప్రచారం.. రెచ్చగొడితే కఠిన చర్యలు తప్పవు: సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 09 , 2026 | 03:51 PM