పండుగలా కొండపల్లి బొమ్మల మేళా: ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్
ABN , Publish Date - Apr 17 , 2026 | 11:42 AM
కొండపల్లి బొమ్మల మేళా మూడు రోజుల పాటు పండుగలా నిర్వహిస్తామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ శా వెల్లడించారు. ఈ మేళ ఏప్రిల్18న ప్రారంభమై.. 20వ తేదీతో ముగుస్తాయని తెలిపారు.
విజయవాడ, ఏప్రిల్17: కొండపల్లి బొమ్మల మేళా మూడు రోజుల పాటు పండగలా నిర్వహిస్తామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ శా వెల్లడించారు. ఏప్రిల్18న ప్రారంభమై.. 20వ తేదీతో ముగుస్తాయని తెలిపారు. శుక్రవారం విజయవాడలో కొండపల్లి బొమ్మల మేళా ఏర్పాటు కోసం జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ లక్ష్మీ శా మాట్లాడుతూ.. అందులో కీలు గుర్రాలు, తోలుబొమ్మలాటలు, కొండపల్లి బొమ్మల ఎగ్జిబిషన్, బొమ్మల కొలువు తదితర ఆకర్షణీయమైన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఈ మేళా వల్ల కొండపల్లి బొమ్మలకు ప్రఖ్యాతి రావడమే కాకుండా, టూరిజం రంగం కూడా అభివృద్ధి చెందుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
అలాగే ఏప్రిల్18వ తేదీ ఉదయం కొండపల్లి కోటపై హెరిటేజ్ వాక్‌తోపాటు ట్రెక్కింగ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ లక్ష్మీ శా చెప్పారు. కొండపల్లిలోని ప్రత్యేక హస్తకళాకారులను ప్రోత్సహిస్తూ.. వారు చేస్తున్న కళకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడం కోసమే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కలెక్టర్ వివరించారు. ఈ కొండపల్లి మేళాపై ప్రజలలో కూడా మంచి చైతన్యం కనిపిస్తోందన్నారు. మరి ముఖ్యంగా కొండపల్లి హస్త కళాకారుల్లో ఒక విధమైన కొత్త ఉత్సాహం కనిపిస్తోందని సంతోషం వ్యక్తం చేశారు.
ఈ మేళాకు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్, స్థానిక లోక్ సభ సభ్యుడు కేశినేని చిన్ని, పర్యాటక శాఖ కార్యదర్శి అజయ్ జైన్‌తోపాటు పర్యాటక శాఖ ఎండీ కూడా హాజరవుతారని చెప్పారు. ఈ కార్యక్రమాలకు విచ్చేయాలని ప్రజలందరిని సాదరంగా ఆహ్వానిస్తున్నామని జిల్లా కలెక్టర్ లక్ష్మీ శా తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సింహాచలం అప్పన్న చందనోత్సవం.. భక్తులకు కీలక సూచన
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్ నారాయణ్ సింగ్ ఎన్నిక
For More AP News And Telugu News