పెన్షన్లపై జగన్ అబద్ధపు ప్రచారాలు: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
ABN , Publish Date - May 22 , 2026 | 02:54 PM
పెన్షన్‌లపై మాజీ సీఎం జగన్ రెడ్డి అవాస్తవాలు మాట్లాడుతున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో 6 లక్షల పెన్షన్లు తొలగించారంటూ జగన్ పచ్చి అబద్ధం చెప్పారన్నారు.
అమరావతి, మే 22: మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. పెన్షన్‌లపై మాజీ సీఎం జగన్ రెడ్డి అవాస్తవాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో 6 లక్షల పెన్షన్లు తొలగించారని జగన్ పచ్చి అబద్ధం చెప్పారన్నారు. జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో ఏకంగా 11 లక్షల మంది నిరుపేదల పెన్షన్లను నిర్దాక్షిణ్యంగా తొలగించిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో మృతిచెందిన వారి పెన్షన్లు మాత్రమే రద్దయ్యాయని వివరించారు.
కూటమి ప్రభుత్వంలో 22 నెలల్లో కొత్తగా 2.50 లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేస్తే.. 6 లక్షల పెన్షన్లు తొలగించారని జగన్ అబద్ధాలు మాట్లాడుతున్నారని మంత్రి ఫైర్ అయ్యారు. ఐదేళ్ల జగన్ ప్రభుత్వంలో పెన్షన్ల కోసం రు.91 వేల కోట్లు ఖర్చు చేస్తే.. కూటమి ప్రభుత్వంలో 22 నెలల్లోనే రికార్డు స్థాయిలో రూ.63,157 కోట్లు ఖర్చు చేసిందని వెల్లడించారు. జగన్ రెడ్డి అబద్ధపు ప్రచారాలను రాష్ట్ర ప్రజలు ఎవరూ నమ్మవద్దని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
పూర్తి ఉచితంగా హోంగార్డులకు ఆరోగ్య బీమా: హోం మంత్రి అనిత
అభినయ్ దర్శన్ వ్యవహారంపై హోం మంత్రి అనిత స్పందన
Read Latest AP News And Telugu News