జగన్ అవినీతి క్రెడిట్‌ను ఎవరూ చోరీ చేయలేరు: మంత్రి కొల్లు రవీంద్ర
ABN , Publish Date - Mar 31 , 2026 | 03:01 PM
జగన్ అవినీతి క్రెడిట్‌ను ఎవరూ చోరీ చేయలేరంటూ మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి విధ్వంసకారుడు, దోపీడీదారుడనే క్రెడిట్ జగన్‌కు మాత్రమే సొంతమన్నారు.
అమరావతి, మార్చి 31: మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి కొల్లు రవీంద్ర(Minister Kollu Ravindra) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ క్రిమినల్, దోపిడీ విధ్వంసాల క్రెడిట్‌ను ఎవరూ చోరీ చేయలేరని వ్యాఖ్యానించారు. తన ఐదేళ్ల పాలనలో చేసింది చెప్పుకునేందుకు ఏమీ లేక చంద్రబాబు చేపడుతున్న అభివృద్ధిని క్రెడిట్ చోరీ చేసేందుకు జగన్ యత్నిస్తున్నారని విమర్శించారు. జగన్ అబద్ధాలకు విస్తృత ప్రచారం కల్పించేందుకు ఆయన సైకో బ్యాచ్ పరితపిస్తోందని మంత్రి అన్నారు.
జగన్ అవినీతి క్రెడిట్‌ను ఎవరూ చోరీ చేయలేరంటూ మంత్రి సెటైరికల్ కామెంట్స్ చేశారు. కడప స్టీల్ ప్లాంట్ పూర్తి చేయలేని క్రెడిట్ జగన్‌దేనని అన్నారు. రాష్ట్రానికి విధ్వంసకారుడు, దోపీడీదారుడనే క్రెడిట్ జగన్‌కు మాత్రమే సొంతమన్నారు. సొంత బాబాయ్‌ను హత్యచేసి పిన్నమ్మ తాళిబొట్టు తెంచిన కేసులో జగన్ ఆడిన డ్రామాల క్రెడిట్ కూడా ఎవరూ చోరీ చేయలేరని చెప్పారు. కన్నతల్లి, సొంత చెల్లిని రోడ్డున పడేసిన క్రెడిట్ ఎవ్వరూ కోరుకోరు కూడా అని వ్యాఖ్యలు చేశారు. ల్యాండ్, సాండ్, మైన్, వైన్, గంజాయ్ వంటి క్రెడిట్‌లతో యువత సహా ఎందరో జీవితాలను జగన్ నాశనం చేశారని మండిపడ్డారు.
దుర్మార్గమైన ఆలోచనలతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి.. 151స్థానాలు వచ్చిన పార్టీని 11కు దిగజార్చిన క్రెడిట్ ఒక్క జగన్‌ది మాత్రమేనంటూ మంత్రి విమర్శించారు. అమరావతి తీర్మానంపై సమాధానం చెప్పలేక, కుటిల రాజకీయాలకు పాల్పడుతున్న వైసీపీ నేతలకు ఇక పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. వైసీపీ భవిష్యత్తు ఇక అంధకారమే అని అన్నారు. కుల, మత, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ వైసీపీ పన్నే కుట్రలు ఇక పారవన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చంద్రబాబు చరిత్రకారుడిగా గుర్తుండిపోతే.. జగన్ చరిత్రహీనుడిగా మిగిలిపోతారని మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి...
చల్లపల్లి పేలుడు ఘటనపై విచారణకు మంత్రి వాసంశెట్టి సుభాశ్ ఆదేశం
లోక్‌సభలో అమరావతి చట్టబద్ధత బిల్లును ప్రవేశపెట్టనున్న కేంద్రం
Read Latest AP News And Telugu News