Share News

చల్లపల్లి పేలుడు ఘటనపై స్పందించిన హోంమంత్రి అనిత

ABN , Publish Date - Mar 31 , 2026 | 01:23 PM

చల్లపల్లి పీఎస్‌ దగ్గర పేలుడు ఘటనపై హోంమంత్రి అనిత స్పందించారు. కృష్ణా జిల్లా ఎస్పీతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న హోంమంత్రి, గాయాలపాలైన పోలీసులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

చల్లపల్లి పేలుడు ఘటనపై స్పందించిన హోంమంత్రి అనిత
Home Minister Anitha On Krishna District Police Explosion

కృష్ణా జిల్లా: చల్లపల్లి పోలీస్‌స్టేషన్‌కు చెందిన వాహనంలో పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. సీజ్ చేసిన టపాసులను తరలిస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో ఎస్సై సహా నలుగురు పోలీసు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు వివరాలు వెల్లడించారు. గతంలో స్వాధీనం చేసుకున్న టపాసులను స్టేషన్‌కు దూరంగా ఉన్న ఒక షెడ్‌లో భద్రపరిచినట్లు తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు వాటిని నిర్వీర్యం చేయడానికి తీసుకెళ్తుండగా ఈ పేలుడు జరిగినట్లు చెప్పారు.


ప్రమాదంలో మొత్తం ఐదుగురు పోలీసు సిబ్బంది గాయపడగా, వారిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయని ఎస్పీ తెలిపారు. గాయపడిన వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం స్థిరంగా ఉందని, ప్రాణాపాయం ఏమీ లేదని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై అంతర్గతంగా పూర్తిస్థాయి విచారణ చేపట్టినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, చల్లపల్లి పోలీస్ స్టేషన్ వద్ద జరిగిన పేలుడుపై హోంమంత్రి అనిత స్పందించారు. జిల్లా ఎస్పీతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. గాయపడిన పోలీసులకు మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.


ఇవి కూడా చదవండి...

నెల్లూరు జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్‌ ట్రైన్.. నిలిచిన రాకపోకలు

పోలీస్ వాహనంలో పేలుడు.. నలుగురికి గాయాలు

Read Latest AP News

Updated Date - Mar 31 , 2026 | 01:30 PM