Share News

పోలీస్ వాహనంలో పేలుడు.. నలుగురికి గాయాలు

ABN , Publish Date - Mar 31 , 2026 | 11:04 AM

కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్‌స్టేషన్‌కు చెందిన వాహనంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఎస్సై సహా నలుగురు పోలీసు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు.

పోలీస్ వాహనంలో పేలుడు.. నలుగురికి గాయాలు
Police Vehicle Blast

కృష్ణా జిల్లా, మార్చి 31: కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్‌స్టేషన్‌కు చెందిన వాహనంలో పేలుడు సంభవించింది. దీపావళి సందర్భంగా సీజ్ చేసిన టపాసులను తరలిస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసు వాహనంలో టపాసులు ఒక్కసారిగా పేలడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో వాహనం పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఎస్సై సహా నలుగురు పోలీసు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.


ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. పోలీసు వాహనంలో టపాసులు తీసుకెళ్తున్న సమయంలో ప్రమాదవశాత్తు పేలుడు సంభవించిందా? లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేశారా అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

ప్రమాదంలో గాయపడిన వారి వివరాలు:

  • ఎస్సై దుర్గ వీరాంజనేయులు

  • హెడ్ కానిస్టేబుల్ తేజ

  • కోర్టు కానిస్టేబుల్ అబ్దుల్లా

  • డ్రైవర్ నాగరాజు


ఇవి కూడా చదవండి...

ఒంటిమిట్టలో ఘనంగా కోదండరాముని బ్రహ్మోత్సవాలు..

నెల్లూరు జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్‌ ట్రైన్.. నిలిచిన రాకపోకలు

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 31 , 2026 | 11:58 AM