చల్లపల్లి పేలుడు ఘటనపై విచారణకు మంత్రి వాసంశెట్టి సుభాశ్ ఆదేశం
ABN , Publish Date - Mar 31 , 2026 | 01:15 PM
చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో పేలుడు ఘటనలో గాయపడిన పోలీసు సిబ్బందికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను మంత్రి వాసంశెట్టి సుభాశ్ ఆదేశించారు. ఈ ప్రమాదంపై జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడి పరిస్థితిపై మంత్రి సమీక్షించారు.
అమరావతి, మార్చి 31: కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో సీజ్ చేసిన టపాసులు పేలిన ఘటనపై ఇన్‌ఛార్జి మంత్రి వాసంశెట్టి సుభాశ్ స్పందిస్తూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనలో గాయపడిన పోలీసు సిబ్బందికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదానికి గల కారణాలను తక్షణమే తెలుసుకుని పూర్తి స్థాయి విచారణ జరపాలని సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీస్ స్టేషన్లలో భద్రతా ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని మంత్రి ఆదేశించారు.
సీజ్ చేసిన పేలుడు పదార్థాల నిల్వలో నిర్లక్ష్యం ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడి పరిస్థితిపై సమీక్షించారు. ప్రమాదానికి గురైన ప్రాంగణంలో భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజల్లో ఎలాంటి భయం అవసరం లేదని, పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని మంత్రి స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా ఎస్పీతో మంత్రి వాసంశెట్టి సుభాశ్ ఫోన్లో మాట్లాడి ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుటున్నారు.
ఇవి కూడా చదవండి...
పోలీస్ వాహనంలో పేలుడు.. నలుగురికి గాయాలు
ప్రబలిన డయేరియా.. వారం రోజులు మాంసం విక్రయాలపై నిషేధం
Read Latest AP News And Telugu News