దసరా ఉత్సవాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట: కలెక్టర్ లక్ష్మీశ
ABN , Publish Date - Oct 03 , 2026 | 11:12 AM
దసరా ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ వెల్లడించారు. భక్తులకు అందించే సౌకర్యాలపై దృష్టిసారించామని తెలిపారు.
విజయవాడ, అక్టోబర్ 03: దసరా ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ వెల్లడించారు. భక్తులకు అందించే సౌకర్యాలపై దృష్టిసారించామని తెలిపారు. దేవాలయ పరిసర ప్రాంతాల్లో 24 గంటలూ సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుందని అన్నారు. దేవాలయ పాలకమండలితో తామంతా సమన్వయం చేసుకుని పని చేస్తున్నామని స్పష్టం చేశారు. సీతమ్మవారి పాదాలు వద్ద స్నానం చేసి అమ్మవారి దర్శనానికి రావచ్చని ఈ సందర్భంగా భక్తులకు ఆయన సూచించారు. అక్టోబర్ 14వ తేదీ సాయంత్రం దుర్గమ్మవారిని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకుంటారని జిల్లా కలెక్టర్ లక్ష్మిశ వివరించారు.
1400 మంది సిబ్బందితో పారిశుద్ధ్య పనులు : వీఎంసీ కమిషనర్
దసరా ఉత్సవ్‌కు జాతీయ స్థాయిలో వీఐపీలు వస్తారని విజయవాడ నగర మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. స్వచ్ఛ దసరా కాన్సెప్ట్ అమలు చేస్తామని చెప్పారు. పారిశుద్ధ్య పనులకు 1400 మంది సిబ్బందిని ఏర్పాటు చేశామని అన్నారు. మూడు మూవింగ్ టాయిలెట్లు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
మూలా నక్షత్రం రోజు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం: ఈవో
ఈ ఏడాది దసరా ఉత్సవాలకు 25 లక్షల మందికిపైగా భక్తులు విజయవాడ వస్తారని అంచనా వేస్తున్నామని దుర్గ గుడి ఈవో శీనానాయక్ వెల్లడించారు. నవరాత్రుల నుంచి రాత్రి 11.00 గంటల వరకు అమ్మవారి దర్శనం కొనసాగుతోందన్నారు. మూలా నక్షత్రం రోజు అమ్మవారికి సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. ఆ రోజు అన్ని ఆర్జిత సేవలూ పరోక్షంగా ఉంటాయని వివరించారు. అక్టోబర్ 17వ తేదీ వేద సభ ఉంటుందని అన్నారు.
నవరాత్రుల్లో తాగునీరు, హోల్డింగ్ ఏరియాలో ఆహారం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అమ్మవారికి యథావిధిగా కుంకుమ పూజలు జరుగుతాయని పేర్కొన్నారు. టీటీడీ స్థలం నుంచి కుంకుమార్చన చేసే భక్తులకు వాహనాలుంటాయని పేర్కొన్నారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లు ప్లాన్ చేశామని.. అందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటామని దుర్గ గుడి ఈవో శీనా నాయక్ వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
శ్రీసిటీలో ఘోర ప్రమాదం.. బాయిలర్ పేలుడు.. ఐదుగురికి పైగా మృతి
అనకాపల్లి రోడ్డు ప్రమాదం.. ట్రాలీని ఢీకొన్న వ్యాన్, ఇద్దరి మృతి