మావిగన్ అంటూ వెళ్తే సున్నాకే పరిమితం.. జగన్‌పై గొట్టిపాటి వ్యాఖ్యలు
ABN , Publish Date - Jul 02 , 2026 | 02:36 PM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రాజధానుల పేరుతో ఎన్నికలకు వెళ్తే వైసీపీకి 11 సీట్లు వచ్చాయని.. ఇప్పుడు మావిగన్ అనే పిచ్చిచేష్టలతో ఎన్నికలకు వెళ్తే సున్నాకే పరిమితం అవుతారంటూ వ్యాఖ్యానించారు.
అమరావతి, జులై 2: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రాజధానుల పేరుతో ఎన్నికలకు వెళ్తే వైసీపీకి 11 సీట్లు వచ్చాయని.. ఇప్పుడు మావిగన్ అనే పిచ్చిచేష్టలతో ఎన్నికలకు వెళ్తే సున్నాకే పరిమితం అవుతారంటూ వ్యాఖ్యానించారు. ఈరోజు(గురువారం) టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలనే లక్ష్యంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మూడు రాజధానుల పేరుతో ఒక్క ఇటుక కూడా పెట్టకుండా.. రూ.450 కోట్లు ఖర్చుపెట్టి తన కోసం ప్యాలెస్ నిర్మించుకున్నారని ఆరోపించారు.
అమరావతి నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని చూసి ఓర్చుకోలేక జగన్ విషం కక్కారని మంత్రి వ్యాఖ్యానించారు. అమరావతిపై తనకు ఎటువంటి వ్యతిరేకతలేదని.. 33000 ఎకరాలు కావాలని చెప్పిన వ్యక్తి జగన్ అని గుర్తుచేశారు. అమరావతిలోనే ఇల్లు కట్టుకున్నానని ఆనాడు ప్రజల్ని నమ్మించారన్నారు. అందుకే ప్రజలు బుద్ధి చెప్పి వైసీపీని 11 సీట్లకే పరిమితం చేశారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు సాధించేందుకు సీఎం చంద్రబాబు అహర్నిశలూ కష్టపడుతున్నారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
గ్రామీణ ఉపాధి రంగంలో సరికొత్త అధ్యాయం మొదలు: పీవీఎన్ మాధవ్
పేదరిక నిర్మూలనలో భాగమే ‘వీబీ జీ రామ్ జీ’ పథకం: పవన్ కల్యాణ్
Read Latest AP News And Telangana News