Share News

శెట్టిబలిజ జాతిపిత దొమ్మేటి వెంకటరెడ్డికి ఘన నివాళి: మంత్రి లోకేశ్..

ABN , Publish Date - Mar 23 , 2026 | 09:03 AM

ఈరోజు(సోమవారం) ప్రముఖ సంఘ సంస్కర్త, శెట్టిబలిజ జాతిపిత దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సైతం వెంకటరెడ్డికి నివాళులు అర్పించారు.

శెట్టిబలిజ జాతిపిత దొమ్మేటి వెంకటరెడ్డికి ఘన నివాళి: మంత్రి లోకేశ్..
AP Minister Nara Lokesh

అమరావతి: ఈరోజు(సోమవారం) ప్రముఖ సంఘ సంస్కర్త, శెట్టిబలిజ జాతిపిత దొమ్మేటి వెంకటరెడ్డి (Dommeti Venkata Reddy) జయంతి. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (Minister Nara Lokesh) సైతం వెంకటరెడ్డికి ఘన నివాళులు అర్పించారు. శెట్టిబలిజ సమాజానికి (Settibalija Community) విద్య, ఐక్యత, గౌరవం తీసుకువచ్చిన గొప్ప నాయకుడంటూ ప్రశంసించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.


'ప్రముఖ సంఘ సంస్కర్త, శెట్టిబలిజ జాతిపిత దొమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ ఘననివాళులు అర్పిస్తున్నాను. శెట్టిబలిజ సమాజానికి విద్య, ఐక్యత, గౌరవం తీసుకువచ్చిన గొప్ప సామాజిక సంస్కర్తగా ఆయన గుర్తింపు పొందారు. శెట్టిబలిజ సంక్షేమ సంఘాన్ని స్థాపించి వారి అభ్యున్నతికి విశేషంగా కృషిచేశారు. ఆయన జయంతిని ప్రజాప్రభుత్వం రాష్ట్ర వేడుకగా నిర్వహిస్తోంది. బడుగు, బలహీనవర్గాల అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన దొమ్మేటి వెంకటరెడ్డి గారి సేవలను ఈ సందర్భంగా స్మరించుకుందాం' అంటూ మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఊపిరి ఉండగానే అంత్యక్రియలకు ఏర్పాట్లు

ఆర్టీఐ కమిషనర్‌పై రిట్‌ పిటిషన్‌!

Updated Date - Mar 23 , 2026 | 09:04 AM